కంప్యూటర్ మీద కూర్చొని ఎదో సీరియస్ గా వర్క్ చేసుకుంటున్నారు.ఇంతలో నిద్ర ముంచుకొస్తోంది .
ఎందుకు వస్తుంది అంటే అలసిపోయారు కాబట్టి.గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్నారు … రెండు బాల్స్ వేసేసరికి బౌలింగ్ లో స్పీడ్ తగ్గిపోయింది ? ఎందుకు తగ్గింది అంటే అలసట వలన.ఈ అలసట అనేది ప్రాణాంతకం కాదు కాని, మన పనుల్ని మాత్రం చంపుతుంది.బద్దకాన్ని పెంచుతుంది.
అలసత్వాన్ని ప్రోత్సహిస్తుంది.పనులు వాయిదాపడతాయి, పూర్తిగా ఆగిపోతాయి.
అందుకే, శ్రమించేవారికోసం కొన్ని ఆహారపదార్థాలు ఉన్నాయి.

* కొబ్బరినీళ్ళు తక్షణశక్తిని అందిస్తాయి.అందుకే రోగులకి కొబ్బరినీళ్ళు తాగించమని సూచిస్తారు డాక్టర్లు.ఇందులో పొటాషియం పాళ్ళు ఎక్కువ.
ఎంత అంటే అరటిపండు కన్నా ఎక్కువ.అందుకే క్రీడాకారులు కూడా కొబ్బరినీళ్ళు బాగా తాగుతారు.
* ఆపిల్, బాదం, ఈ రెండు కలిపి తీసుకుంటే మీలో చలాకీతనం వచ్చేస్తుంది.ఎందుకంటే ఆపిల్ లో నేచురల్ షుగర్స్, ఫైబర్ బాగా ఉంటాయి.
ఇవి తక్షణ శక్తిని అందిస్తాయి.ఇక బాదం గురించి మనకి తెల్సిందే.
ప్రోటీన్లు, మేగ్నేశియం, ఇతర మినరల్స్ దండిగా దొరకడం వలన శారీరక శ్రమ ఎక్కువ ఉన్నవారు ఆపిల్, బాదం కలిపి తింటుంటారు.

రెండిట్లో యాంటిఆక్సిడెంట్స్, విటమిన్ సి బాగా దొరుకుతుంది.కాబట్టి ఏమాత్రం అలసటగా అనిపించినా, నిమ్మ, ఆరెంజ్ కలుపుకొని జ్యూస్ తయారుచేసుకోండి.
ఇది మిమ్మల్ని వెంటనే రీచార్జ్ చేస్తుంది.అలసత్వాన్ని దూరం చేసి, పని మీద దృష్టి కేంద్రికరించేలా చేస్తుంది.
* ఒక్కోసారి అలసటకి కారణం బ్లడ్ సర్కిలేషన్ లో సమస్య ఉండటం.ఒంట్లో రక్తమే సరిగా ప్రవహించకపోతే ఇక పనులు చేసేందుకు శరీరం ఎలా సహకరిస్తుంది ? అందుకే రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహరం కావాలి.సరిగ్గా అలాంటి ఆహారమే అల్లం.బ్లడ్ ఫ్లో సిస్టంని ఎన్నో రెట్లు మెరుగుపరిచే అల్లం మీ దగ్గర ఉంటే, అలసట దూరంగా ఉంటుంది.
