విజయదశమి రోజు జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారు తెలుసా..?

దసరా పండుగ( Dasara Festival ) రోజున శమీ పూజ చేస్తారని దాదాపు చాలా మందికి తెలుసు.తర్వాతే జమ్మి ఆకులను కూడా పంచుకుంటారు.

 What Is The Importance Of Worshiping Jammi Chettu Shami Tree On Dasara Details,-TeluguStop.com

దీని వెనుక ఎన్నో కథలు ఉన్నాయి.అలాగే శమీ పూజ( Shami Pooja ) చేసి జమ్మి ఆకులను పెద్దలకు పంచి పెడతారు.

వారి ఆశీర్వాదం తీసుకుంటారు.జమ్మి చెట్టు ను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.

శమీ చెట్టును పూజించడం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి.రుగ్వేద కాలం నుంచి జమ్మి వృక్షం ప్రస్తావన ఉంది.

జమ్మి చెట్టును శమీ వృక్షం అని కూడా పిలుస్తారు.అమృతం కోసం దేవుళ్ళు పాల సముద్రాన్ని చిలికే సమయంలో దేవత వృక్షాలు కూడా వచ్చాయని అందులో శమీ వృక్షం కూడా ఉందని పండితులు చెబుతున్నారు.

Telugu Bhakti, Dasara Festival, Devotional, Jammi Tree, Maha Bharatam, Pandavas,

అప్పట్లో దీన్ని అగ్ని నీ పుట్టించే సాధనంగా ఉపయోగించే వారని అందుకే అరణి( Arani ) అని కూడా పిలుస్తారని పండితులు చెబుతున్నారు.త్రేతా యుగంలో లంకకు వెళ్లే సమయంలో రాముడు( Sri Rama ) శమీ పూజ చేసి వెళ్ళాడని ఎన్నో కథలు ఉన్నాయి.అందుకే రావణుడి( Ravana ) మీద విజయం సాధించాడని చెబుతున్నారు.ఇక మహాభారతంలోనూ జమ్మి చెట్టు( Shami Tree ) ప్రస్తావన ఉంది.పాండవులు ( Pandavas ) అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను ఒక మూటలో కట్టి దానిని శమీ వృక్షం పై పెట్టారు.అజ్ఞాతవాసం పూర్తయ్యే వరకు ఆయుధాలను కాపాడాలని శమీ వృక్షానికి పూజలు చేశారు.

Telugu Bhakti, Dasara Festival, Devotional, Jammi Tree, Maha Bharatam, Pandavas,

అజ్ఞాతవాసం తర్వాత వచ్చి జమ్మి చెట్టుకు పూజ చేసి ఆయుధాలను తీసుకొని యుద్ధంలో గెలిచారని చెబుతున్నారు.అప్పటి నుంచి శమీ వృక్షాన్ని పూజిస్తే అపజయం ఉండదని నమ్ముతారు.ఇంకా చెప్పాలంటే జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి.ఆ తర్వాత ఆకులను తెంచుకొని వాటిని బంగారంలా భావించి ఇంటికి తీసుకెళ్తారు.తర్వాత ఒకరికొకరు పంచుకుంటారు.పెద్దలకు ఇచ్చి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు.

జమ్మిని పూజిస్తే జీవితంలో విజయాలు వస్తాయని అందరూ నమ్ముతారు.జమ్మి చెట్టు చాలా కాలం బతుకుతుంది.

జమ్మి చెట్టును నాటువైద్యం లో ఉపయోగిస్తారు.ఈ చెట్టు గాలి ఆరోగ్యానికి మంచిదని చెబుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube