పూర్వం సమాజంలో బయటి పనులన్నీ మగవారు ఇంట్లో ఉన్న పనులన్నీ ఆడవారు చేసుకుని చేసుకుంటూ ఉండేవారు.ఆడవారికి ఇంటి పని వరకు తెలిస్తే చాలని చాలామంది తల్లిదండ్రులు భావించేవారు.
కానీ ప్రస్తుత సమాజంలో చాలామంది యువత తమతో పాటు దమ్ము పెళ్లి చేసుకునే అమ్మాయి కూడా చదువుకోవాలని తమలాగే మంచి ఉద్యోగం చేయాలని కోరుకుంటున్నారు.ఆడపిల్లలు కూడా పెళ్లి కాకముందే తల్లిదండ్రులకు ఆర్థిక సాయం చేయాలని వారికి తమ వంతు ఏదైనా సహాయం చేయాలని కోరుకొంటున్నారు.
పెళ్లయ్యాక భర్త పై భారం పడనివ్వకుండా చూసుకోవాలని చాలామంది అమ్మాయిలు ప్రస్తుత కాలంలో కోరుకుంటున్నారు.
ఇలా కోరుకునే అమ్మాయిలు చాలామంది ఉన్నా ఈ రాశులలో మరీ ఎక్కువగా ఉన్నారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
కన్యారాశి వారు సహజంగా పరిపూర్ణత కోసం ప్రయత్నిస్తూ ఉంటారు.వారు తమ పని యొక్క ప్రతి అంశాన్ని అంచనా వేస్తూ ఉంటారు.ఈ రాశి వారు ఎక్కువ పనితనం కలిగి ఉంటారు.అలాగే భర్తను ఆర్థికంగా ఆదుకునేందుకు ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు.
ఆర్థిక అవసరాల సమయంలో వారి భాగస్వామికి భరోసా ఇస్తూ ఉంటారు.వీరు ఆర్థిక నిర్వహణలో తమ భాగస్వామికి సహాయం చేయడం పట్ల ఎల్లప్పుడూ ముందుంటారు.
వృశ్చిక రాశి వారు తాము ఎంచుకున్న వృత్తిలో శ్రద్ధపెట్టి పనిచేస్తారు.

వారు చేసే పనిలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు.తమ వ్యాపారాలను లాభదాయకంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకుని ఉంటారు.వృశ్చిక రాశి స్త్రీలు సంబంధాల కంటే డబ్బు సంపాదించడానికి కూడా ఎక్కువ ఆసక్తి చూపుతారు.
ఈ రాశి వారు తమ భాగస్వాములను ఆర్థికంగా సురక్షితంగా ఉంచడంలో ఎప్పుడూ ముందు ఉంటారు.వృషభ రాశి స్త్రీలకు పట్టుదల, ఓర్పు, పని తీరు కలిగి ఉంటారు.
కష్టపడి పనిచేయడం వల్ల తమ లక్ష్యాలను చేరుకోవడంలో విజయం సాధించే అవకాశం ఉంది.ఈ రాశి ఆడ వారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు.
అందువల్ల విరు తమ భర్తలకు ఆర్థిక సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు.