TDP Janasena Alliance : టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవాలన్నదే జగన్ కోరిక ?

ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది.  ఎన్నికలకు ఇంకా సమయం ఎంతో లేకపోవడంతో అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

 Ys Jagan On Chandrababu Pawan Kalyan Alliance, Tdp, Chandrababu, Ys Jagan,ycp,ap-TeluguStop.com

నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాబలం పెంచుకునే విషయంపైనే దృష్టి సారించాయి.రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

ముఖ్యంగా బిజెపి , జనసేన లు ఏపీలో పొత్తు కొనసాగిస్తుండగా, ఆ రెండు పార్టీలతో కలిసినందుకు టీడీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది.ఇటీవలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో టిడిపి అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా అనేక రాజకీయ అంశాలపై చర్చ జరిగింది.అయితే పవన్ కు  విశాఖలో జరిగిన అవమానంపై సంఘీభావం తెలిపేందుకే ఈ భేటీ జరిగింది అనే ప్రచారం జరిగినా.

వీరి మధ్య పొత్తుకు సంబంధించిన అంశమే ప్రధానంగా చర్చకు వచ్చినట్లు అందరికీ అర్థం అయ్యింది.

అయితే ఏపీలో జనసేన , టిడిపిలు పొత్తు పెట్టుకుంటే .ఖచ్చితంగా వైసీపీ అధికారానికి దూరం అవుతుందని, 2024 ఎన్నికల్లో టిడిపి జనసేన పార్టీలే ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని అంతా భావిస్తుండగా.ఈ విషయంలో వైసిపి అధినేత .ఏపీ సీఎం జగన్ మాత్రం వేరే లెక్కల్లో ఉన్నారు.టిడిపి, జనసేన కలిస్తేనే తమకు కలిసి వస్తుందని, ఆ రెండు పార్టీలు ఎంత త్వరగా కలిస్తే అంతగా తమకు అనుకూలంగా మారుతుందని లెక్కలు వేసుకుంటున్నారు.

ప్రస్తుతం జనసేన ఒంటరిగా ఎన్నికలకు వెళ్లినా… టిడిపి తో కలిసి పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళినా.కాపు సామాజిక వర్గం అంతా గంప గుత్తగా ఆ పార్టీకి అండగా నిలబడే ఛాన్స్ లేదు.

ఈ విషయం 2019 ఎన్నికల్లోనే రుజువు అయింది.

Telugu Ap, Bc, Chandrababu, Janasenani, Pawan Kalyan, Tdpjanasena, Ys Jagan-Poli

అదీ కాకుండా ఏపీలో కమ్మ సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గానికి మధ్య అంత సఖ్యత లేదు.ఒకవేళ టీడీపీ , జనసేన పొత్తు పెట్టుకున్నా .మెజారిటీ కాపు సామాజిక వర్గం ఆ పొత్తును వ్యతిరేకిస్తుందని జగన్ అంచనా వేస్తున్నారు.ఇక ఏపీలో కీలకంగా ఉన్న బీసీ సామాజిక వర్గం టిడిపి, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా వైసీపీ వైపే నిలబడతారని, దాదాపు 80 శాతానికి పైగా బీసీ ఓటర్లు వైసీపీ వైపు వస్తారని జగన్ అంచనా వేస్తున్నారు.ఇప్పటికే బీసీ సామాజిక వర్గానికి ఎక్కువగా జగన్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది.

అనేక నామినేటెడ్ పదవులు కేటాయించింది.అలాగే మంత్రి పడవుల్లోనూ ప్రాధాన్యం కల్పించారు.

టిడిపి, జన సేన లు పొత్తు పెట్టుకుంటే , మెజార్టీ కాపు సామాజిక వర్గంలో చీలిక వచ్చి ఫలితం తమకు అనుకూలంగా మారుతుందని జగన్ లెక్కలు వేసుకుంటున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube