ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప ది రైజ్. ఇదే కలయికలో ఇప్పుడు పుష్ప 2 తెరకెక్కుతుంది.
ఈ సినిమాలో నటించిన వారందరికీ పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించడంతో ఈ సినిమా బాగా సహాయ పడింది.అలాగే పుష్ప సినిమాతో ఉత్తరాది ప్రేక్షకుల మనసులో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకుని పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు పుష్పరాజ్ అలియాస్ అల్లు అర్జున్.
పుష్పరాజ్ తగ్గేదేలే అని చెబితే రికార్డులు గల్లంతు అవ్వాల్సిందే.మరి ఈ సినిమాలోని లుక్ కూడా బాగా ఆకట్టుకుంది.
అల్లు అర్జున్ లుక్ లో చాలా మంది మారిపోయి హంగామా చేసారు.అంతగా ఈయన రగ్గడ్ లుక్ ఆకట్టుకుంది.
అయితే తాజాగా ఈ సినిమా పార్ట్ 2 లో ఈయన లుక్ గురించి అప్డేట్ ఒకటి వచ్చింది.పుష్ప 2 లో బన్నీ స్టైలిష్ అండ్ క్లాస్ డాన్ లుక్ లో కనిపించి ఫ్యాన్స్ ను ఆకట్టు కుంటాడట.
పుష్పరాజ్ నుండి సిండికేట్ డాన్ గా బన్నీ ఎదిగిన తర్వాత ఈయన లుక్ మారిపోయి మరింత స్టైలిష్ లుక్ లోకి వస్తాడట.మరి ఈ లుక్ ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టు కుంటుందో చూడాలి.
ఏది ఏమైనా ఈసారి సుకుమార్ పుష్పరాజ్ ఫ్యాన్స్ కోసం మరింత సర్ప్రైజ్ లు రెడీ చేస్తున్నాడు.

పార్ట్ 1 సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు పార్ట్ 2 పై భారీ అంచనాలే పెరిగాయి.అందుకే సుకుమార్ కూడా తొందర పడకుండా పక్క ప్లానింగ్ తో మరింత పక్కాగా స్క్రిప్ట్ తో బరిలోకి దిగుతున్నాడు.ఇప్పటి వరకు షూటింగ్ గురించి అధికారికంగా చెప్పలేదు కానీ ఆల్రెడీ ఈ సినిమా షూట్ ను సైలెంట్ గా ముగిస్తున్నారు అనే వార్తలు మాత్రం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.







