పాలు.అన్ని వయసులవారూ తీసుకోదగ్గ ఉత్తమ ఆహారం ఇది.పిల్లలకు, పెద్దలకు పాలు చేసే మేలు అంతా ఇంతా కాదు.పాలలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ డి, విటమిన్ ఎ, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా అనేక పోషకాలు నిండి ఉంటాయి.
ఇక ఎన్నో పోషకాలు నిండి ఉండే పాలు.ఆరోగ్య పరంగానే కాకుండా సౌందర్య పరంగా కూడా ఉపయోగపడతాయి.అయితే పాలు ఆరోగ్యానికి మంచిది కదా అని చాలా మంది అతిగా తీసుకుంటుంటారు.
కానీ, ఏ ఆహారాన్ని అయినా లిమిట్‌గా తీసుకుంటేనే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.అలా కాకుండా ఆ లిమిట్‌ను క్రాస్ చేస్తే మాత్రం.అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇది పాల విషయంలో కూడా వర్తిస్తుంది.అవును, ఎన్నో వ్యాధులను తరిమి కొట్టే పాలను అతిగా తీసుకోవడం వల్ల నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
ముఖ్యంగా పాలను మోతాదు మించి తీసుకోవడం వల్ల అందులో అత్యధికంగా ఉండే ప్రోటీన్లు శరీర రోగ నిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
అలాగే అతిగా పాలు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.ముఖ్యంగా ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ప్రతి రోజు పాలు తీసుకుంటే ఎముకలు, దంతాలు దృఢంగా మారతాయన్న సంగతి అందరికీ తెలుసు.
కానీ, అదే పాలు అతిగే తీసుకుంటే.ఎముకలు, దంతాలు తీవ్రంగా దెబ్బ తింటాయి.
అంతేకాదు, అతిగా పాలు తీసుకుంటే.గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అలాగే కొందరు రాత్రి పడుకునే ముందు ఫుల్‌గా పాలు తాగేసి పడుకుంటారు.కానీ, పాలు తాగిన వెంటనే నిద్రిస్తే.రోగాలను కోరి తెచ్చుకున్నట్టు అవుతుంది.కాబట్టి, పాలు తాగడానికి.
నిద్రకు మధ్య కనీసం గంటన్నర గ్యాప్ ఉండేలా చూసుకోవాలి.ఇక పాలు అతిగా తాగడం వల్ల చర్మ అలర్జీలు, ముఖంపై మొటిమలు వస్తాయి.
కాబట్టి, మీకు అతిగా పాలు తాగే అలవాటు ఉంటే.దానిని తగ్గించుకోవడం మంచిది.