1.సికింద్రాబాద్ లో రైళ్లకు నిప్పు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ అగ్నిపథ్ ‘ పథకానికి వ్యతిరేకంగా నిరసనలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి సికింద్రాబాద్ లోనూ ఆందోళనకారులు మూడు రైళ్లకు నిప్పు పెట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
2.రాహుల్ విచారణ సోమవారానికి వాయిదా
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విచారణ సోమవారానికి వాయిదా పడింది.
3.సోనియాగాంధీ ఆరోగ్య పరిస్థితిపై కాంగ్రెస్ ప్రకటన
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోగ్యపరిస్థితిపై ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది గంగారా ఆసుపత్రిలో సోనియాగాంధీకి చికిత్స కొనసాగుతున్నట్టు పేర్కొంది.
4.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 12,847 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
5.మాస్టర్ కార్డుల ఫై నిషేధం ఎత్తివేత
మాస్టర్ కార్డ్ పై విధించిన నిషేధం ఎత్తివేస్తూ ఆర్.బి.ఐ తాజాగా నిర్ణయం తీసుకుంది.
6.జేసీ ప్రభాకరరెడ్డి ఇంట్లో ఈడి సోదాలు
అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే , టిడిపి నాయకుడు జెసి ప్రభాకర రెడ్డి ఇంట్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు.
7.నేడు ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాలు
ఏపీ లో ఇంటర్మీడియట్ ఫలితాలు నేడు విడుదలయ్యే అవకాశాలున్నాయి.బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ నేడు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేస్తోంది.
8.బండి సంజయ్ ను అడ్డుకున్న పోలీసులు
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు సంఘీభావం ప్రకటించేందుకు వెళుతున్న తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పోలీసులు పట్టుకున్నారు.
9.సింగరేణి నోటిఫికేషన్
సింగరేణిలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
10.డేరా చీఫ్ గుర్మిత్ కు పెరోల్
అత్యాచార కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ కు పెరోల్ మంజూరు అయ్యింది.
11.ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్
జూన్ 24 నుంచి ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ మొదలు పెడుతున్నట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ వి ఆర్ చౌదరి తెలిపారు.
12.సికింద్రాబాద్ పరిధిలో 71 రైళ్లు రద్దు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనతో రైల్వే శాఖ ముందస్తుగా అప్రమత్తమైంది.సికింద్రాబాద్ పరిధిలో 71 రైళ్లను రద్దు చేసింది.
13.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపు రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ధ్వంసం, ఉద్రిక్తత కారణంగా రాకపోకలపై ఆంక్షలు విధించారు.
14.రాజస్థాన్ సీఎం సోదరుడి ఇంట్లో సిబిఐ సోదాలు
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సోదరుడు అగ్రసేన్ గెహ్లాట్ సేవా సంస్థ పై సిబిఐ దాడులు నిర్వహించింది.జోధ్ పూర్ లోని ఆయన నివాసం తో పాటు, పలుచోట్ల సిబిఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
15.హైదరాబాదులో మెట్రో బంద్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఆందోళనతో నగరంలో మెట్రో సేవలు నిలిచిపోయాయి.
16.సికింద్రాబాద్ ఆందోళనల్లో ఒకరు మృతి
అగ్నిపత్ ఏం చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మీ అభ్యర్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది.
ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను పూర్తిగా ధ్వంసం చేయడంతో రైల్వే పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు కాల్పులు జరిపారు.ఈ ఘటనలో ఒకరు మరణించగా మరొకరు గాయాలపాలయ్యారు.
17.తిరుమలలో ఆగస్టు 7 న ‘ కళ్యాణమస్తు ‘
తిరుమలలో ఆగస్టు 7న కల్యాణమస్తు కార్యక్రమం జరగనుందని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
18.తెలుగు బంటి దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు
నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలం పడమటి నాయుడు పల్లి గ్రామంలో ఎలుగుబంటి దాడి చేయడంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.వెంటనే అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
19.జాబ్ క్యాలెండర్ అమలు పై జగన్ సమీక్ష
ఏపీ సీఎం జగన్ ఈరోజు ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జాబ్ క్యాలెండర్ అమలుపై సమీక్ష నిర్వహించారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,750 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 52,100
.