సురేష్ కొండేటి.( Suresh Kondeti ) ఈ పేరు ఈ మధ్య కాలంలో చాల బాగా వినిపిస్తుంది.
ఒక జర్నలిస్ట్ గా ప్రతి సినిమా ప్రెస్ మీట్ లో పాల్గొని ఎదో ఒక వివాదాస్పద ప్రశ్న అడుగుతూ జనాలను ఎంటర్టైన్ చేయడం లేదా సినిమాకు ప్రమోషన్ చేసి పెట్టడం వల్ల ఈయన గురించి మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తుంది.అయితే నిజానికి సురేష్ కొండేటి అనే వ్యక్తి కేవలం జర్నలిస్ట్ మాత్రమే కాదు.
సినిమా అంటే ఎంతో ఆసక్తి ఉండి, సినిమా పై ఇష్టం తో ఇండస్ట్రీ కి వచ్చి నటుడిగా, డిస్ట్రిబ్యూటర్ గా, ఎడిటర్ గా మరియు నిర్మాత గా పని చేస్తున్నారు.అంత కాదు సురేష్ కొండేటి 2002 లో సంతోషం మ్యాగజిన్ పెట్టి సంతోషం అవార్డ్స్( Santosham Awards ) కూడా ప్రతి యేడు ఇస్తున్నారు.

మహేశ్వరి ఫిలిమ్స్( Maheshwari Films ) అనే పేరుతో ఒక సంస్థను ప్రారంభించి దిష్ట్రుబ్యూషన్ చేసేవారు.ఆ తర్వాత ఎస్కె పిక్చర్స్ పేరుతో మరొక సంస్థను ప్రారంభించి సినిమా నిర్మాణం చేపట్టారు.మాములుగా ఒకటో రెండో సినిమాలు తీశారు అంటే మీరు పప్పులో కలిసేయినట్టే.సురేష్ ఏకంగా 15 సినిమాలను నిర్మించారు .అందులో చాల పెద్ద హిట్స్, చిన్న సినిమాలు కూడా ఉన్నాయ్.అయన నిర్మాణంలో వచ్చిన సినిమాలు ఎక్కువగా తమిళం నుంచి తెలుగు కు డబ్బింగ్ చేసినవే కావడం విశేషం.
అందులో పిజ్జా,( Pizza ) ప్రేమిస్తే,( Premiste ) జర్నీ,( Journey ) లీసా, డాక్టర్.సలీం, ప్రేమించాలి, మెట్రో, జనతా హోటల్ వంటివి ఉండగా, రేణిగుంట, లవ్ ఇన్ షాపింగ్ మాల్, క్రేజీ, ప్రేమలో పడితే, మహేష్, రైడ్ వంటి నేరుగా తెలుగులో సినిమాలు ఉన్నాయ్.

ఇక కమిడియన్ షకలక శంకర్ తో శంభో శంకర( Shambo Shankara ) అనే సినిమా కూడా తీసాడు.నటుడిగా రాంబంటు, ఎర్ర చీర, మిస్టర్ ప్రెగ్నెంట్ , దేవినేని వంటి చిత్రాల్లో కనిపించాడు.1992 నుంచి సినిమా ఇండస్ట్రీ లో ఉన్న సురేష్ కొండేటి ఫిలిం జర్నలిస్ట్ గా( Film Journalist ) కెరీర్ మొదలు పెట్టి నేటికీ కూడా ఆ వృత్తిని వదలడం లేదు.ఇక మొన్నటి మా అసోసియేషన్ ఎలక్షన్స్ లో ప్రకాష్ రాజ్ ప్యానల్ తరపున ఈసీ మెంబర్ గా పోటీ చేసాడు.
ప్రస్తుతం మెగా ఫ్యామిలీ సినిమాలకు పీఆర్వో గా కూడా పని చేస్తున్నాడు.లాఫ్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కి మెంబర్ గా కూడా ఉన్నాడు.







