చిత్ర పరిశ్రమలో నెపోటిజం( Nepotizam ) ఉందనే విషయం మనకు తెలిసిందే.ఎంతోమంది స్టార్ సెలబ్రిటీల పిల్లలు తమ తల్లిదండ్రుల వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతూ ఉన్నారు.
అయితే ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే వారసత్వం మాత్రమే పనికిరాదు అది కేవలం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం కోసమే అవసరమవుతుందని ఆ తర్వాత మేమే అవకాశాలను తెచ్చుకుని వాటిని సరైన విధంగా సద్వినియోగం చేసుకుంటేనే ఇండస్ట్రీలో ఉండగలమని ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు ఇప్పటికే నెపోటిజం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలోనే మరికొందరు ఇండస్ట్రీలో ఉన్నటువంటి నెపోటిజం గురించి కూడా పలు వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నేలుస్తుంటారు.అయితే తాజాగా ప్రభాస్ ( Prabhas ) హీరోయిన్ నటి కృతి సనన్( Kriti Sanon ) తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని బాలీవుడ్( Bollywood ) ఇండస్ట్రీలో ఉన్నటువంటి నెపోటిజం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.తాను కూడా కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఈమె తెలియజేశారు.
కెరియర్ మొదట్లో తనకి పెద్ద పెద్ద సినిమాలలో అవకాశాలు వచ్చాయి.అయితే ఈ అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయేవని తెలిపారు.

పలు సినిమాలలో తాను హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యాను ఇలా పెద్ద సినిమాలలో అవకాశం రావడంతో చాలా సంతోషపడ్డాను అయితే సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే సమయానికి ఆ సినిమాలో నేను కాకుండా మరొక స్టార్ కిడ్ హీరోయిన్ కొనసాగే వారు అంటూ ఈ సందర్భంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి నెపోటిజం గురించి ఈమె కామెంట్స్ చేశారు.ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో నెపోటిజం కాస్త ఎక్కువగానే ఉందని ఈమె తెలియజేశారు.సినిమా అవకాశాలు చేజారిపోయిన తాను ఎప్పుడు బాధపడలేదని ఈ సందర్భంగా కృతి సనన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.







