Amla : ఆరోగ్యానికి ఔషధం ఉసిరి.. నిత్యం ఇలా తీసుకున్నారంటే అంతులేని లాభాలు మీ సొంతం!

ఉసిరికాయలు( Amla ) ఆరోగ్యానికి ఔషధం అనడంలో ఎటువంటి సందేహం లేదు.పులుపు, వగరు రుచులను కలగలిసి ఉండే ఉసిరికాయల్లో ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్( Anti Oxidants ) రిచ్ గా ఉంటాయి.

 Consuming Amla In This Way Has Amazing Health Benefits-TeluguStop.com

అందువల్ల ఆరోగ్యానికి ఉసిరి ఎంతో మేలు చేస్తుంది.ఆయుర్వేదంలో ఉసిరి వినియోగం చాలా ఎక్కువ.

అనేక రోగాలను నయం చేయడానికి ఉసిరి అద్భుతంగా సహాయపడుతుంది.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా ఉసిరిని నిత్యం తీసుకుంటే అంతులేని లాభాలు మీ సొంతం అవుతాయి.

అందుకు ముందుగా 5 ఉసిరికాయలు తీసుకుని నీటితో శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి పెట్టుకోవాలి.ఆ తర్వాత ఉసిరికాయల‌ను గింజ తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక గ్లాస్ జార్ లో కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు వేసుకోవాలి.

Telugu Amla, Amla Benefits, Black Pepper, Tips, Healthy Heart, Honey, Latest-Tel

అలాగే వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి మరియు ఒక గ్లాస్ స్వచ్ఛమైన తేనె( Honey ) వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక రోజంతా వదిలేయాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని వన్ టేబుల్ స్పూన్ చొప్పున రెగ్యులర్ గా ఉద‌యాన్నే తీసుకుంటే ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు పొందుతారు.తేనెలో ఊరబెట్టిన ఉసిరిని నిత్యం తిన‌డం వల్ల మన రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది.

ఉసిరిలో విటమిన్ సి ఉంటుంది.అలాగే తేనె మరియు మిరియాల్లో యాంటీ మైక్రోబియల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.

ఇవి ఇమ్యూనిటీ పవర్ ను పెంచి, అంటు వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడతాయి.అనేక జబ్బుల నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి.

అలాగే బరువు తగ్గాలని( Weight Loss ) ప్రయత్నిస్తున్న వారికి ఉసిరి, తేనె, మిరియాల మిశ్రమం ఒక సూపర్ ఫుడ్ గా చెప్పుకోవచ్చు.ఉసిరిలో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువ‌గా ఉంటుంది.

ఇది అతిగా తినడాన్ని తగ్గిస్తుంది.మిరియాలు మరియు తేనె మెటబాలిజం రేటును పెంచుతాయి.

కేలరీలు త్వరగా బర్న్ అయ్యేలా ప్రోత్సహిస్తాయి.

Telugu Amla, Amla Benefits, Black Pepper, Tips, Healthy Heart, Honey, Latest-Tel

తేనెలో నానబెట్టిన ఉసిరికాయలు తీసుకోవడం వల్ల రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్( Bad Cholesterol ) మొత్తం కరుగుతుంది.ఫలితంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.ఉసిరి తేనె మ‌రియు మిరియాల‌తో క‌లిసి తీసుకుంటే మెరుగైన జీర్ణక్రియ మరియు పోషకాల శోషణకు సహాయపడుతుందని నిపుణులు తెలిపారు.

ఇక ఉసిరి, తేనె, మిరియాలు కలిపి తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పి మరియు శ్వాస సంబంధిత సమస్యలు ఉంటే దూరం అవుతాయి.చర్మ ఎల్లప్పుడూ కాంతివంతంగా, యవ్వనంగా మెరుస్తుంది.

జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.ఒత్తిడి, డిప్రెషన్( Depression ) వంటి మానసిక సమస్యలు పరారవుతాయి.

మెదడు సూపర్ షార్ప్ గా సైతం పని చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube