డయాబెటిస్( Diabetes ).దీన్నే తెలుగులో షుగర్ వ్యాధి లేదా మధుమేహం అని కూడా పిలుస్తారు.
ఒకప్పుడు వయసు పైబడిన వారే డయాబెటిస్ బారిన పడేవారు.కానీ ఇటీవల రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు.
ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి.ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే.
అలాగే అనేక ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది.ముఖ్యంగా స్వీట్స్ కు దూరంగా ఉండాల్సి ఉంటుంది.
అందుకే డయాబెటిస్ అంటేనే భయపడుతుంటారు.

అయితే షుగర్ వ్యాధి వచ్చాక బాధపడటం కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు.అందుకోసం నిత్యం అరగంట పాటు వ్యాయామం చేయండి.ధూమపానం, మద్యపానం అలవాట్లను వదులుకోండి.
కంటినిండా నిద్ర ఉండేలా చూసుకోండి.ఒత్తిడికి దూరంగా ఉండండి.
షుగర్ కు బదులు బెల్లం, తేనె వంటివి ప్రిఫర్ చేయండి.ఇకపోతే కొన్ని కొన్ని ఆహారాలు డయాబెటిస్ వచ్చే రిస్క్ ను తగ్గించడానికి అద్బుతంగా తోడ్పడతాయి.
అటువంటి వాటిల్లో డ్రాగన్ ఫ్రూట్ ఒకటి.
ఈ ఫ్రూట్ చూడడానికి ఆకర్షణీయంగానే కాదు ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్లు, ఫైబర్ తో సహా అనేక పోషకాలను కలిగి ఉంటుంది.
డయాబెటిస్ కు దూరంగా ఉండాలనుకునేవారు కచ్చితంగా డ్రాగన్ ఫ్రూట్ ను డైట్ లో చేర్చుకోండి.డ్రాగన్ ఫ్రూట్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేయడానికి చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.
డ్రాగన్ ఫ్రూట్ ను నేరుగా తినలేనివారు బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు తరిగిన డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు, ఒక గ్లాసు ఫ్రెష్ కొబ్బరి నీళ్లు, వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ మరియు రెండు లేదా మూడు ఫ్రెష్ పుదీనా ఆకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

తద్వారా హెల్తీ అండ్ టేస్టీ డ్రాగన్ ఫ్రూట్ స్మూతీ సిద్దమవుతుంది.ఈ విధంగా డ్రాగన్ ఫ్రూట్ ను వారానికి కనీసం రెండు సార్లు తీసుకున్న చాలు మధుమేహం వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గుతుంది.ఒకవేళ మధుమేహం ఉన్నవారు ఈ స్మూతీని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
అంతేకాదు ఈ డ్రాగన్ ఫ్రూట్ స్మూతీ ఎముకలను దృఢంగా మారుస్తుంది.మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది.
మరియు వెయిట్ లాస్ కు సైతం సహాయపడుతుంది.







