తరతరాల నుంచి చాలామంది భోజనం చేశాక తమలపాకులు తింటూ ఉంటారు.పెళ్లిళ్లలో కూడా భోజనం చేసిన తర్వాత తమలపాకును కచ్చితంగా తింటారు.
అయితే ఇలా తమలపాకులు తినడం మంచిదేనా అని అడిగితే కచ్చితంగా మంచిదే అని చెబుతున్నారు వైద్య నిపుణులు.ఎందుకంటే తమలపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.
తమలపాకును తింటే చిన్న దగ్గు నుంచి పెద్ద సమస్య వరకు కూడా దూరం చేసే శక్తి తమలపాకుకు ఉంది.
అలాగే భోజనం చేసిన తర్వాత తమలపాకును తింటే ఆహారం కూడా త్వరగా జీర్ణం అవుతుంది.
అలాగే తమలపాకులో విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రైబోఫ్లావీన్, కెరోటిన్ లాంటి విటమిన్లతో పాటు క్యాల్షియం లాంటి పోషకాలు కూడా ఉన్నాయి.తమలపాకులును తింటే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది.
అలాగే జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.అలాగే కడుపు, ప్రేగులలో పిహెచ్ స్థాయిలను క్రమబద్దీకరించడానికి తమలపాకు ఉపయోగపడుతుంది.
అలాగే తమలపాకు నొప్పి నివారిణిగా కూడా పనిచేస్తుంది.ఒంటినొప్పుల నుంచి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.ఇంకా ఉదయాన్నే పడగడుపున తమలపాకును తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.కడుపు సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో తమలపాకులు తింటే చాలా మంచిది.అలా తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.పోషకా లోపాలను కూడా తమలపాకు దూరం చేస్తుంది.
ఆస్తమాతో బాధపడుతున్న వాళ్లు కూడా తమలపాకు తినడం వల్ల వీటన్నిటితో ఉపశమనం పొందవచ్చు.
ఇక తమలపాకుపై కాస్త ఆవాల నూనె రాసి వేడి చేసి చాతిపై పెట్టుకుంటే గుండెనొప్పి సమస్యల నుండి కూడా బయటపడవచ్చు.అలాగే తమలపాకుల్లో క్రిమినాశక గుణాలు కూడా ఉంటాయి.అందుకే ఖాళీ కడుపుతో తమలపాకును ప్రతిరోజు ఉదయం తీసుకుంటే ఇన్ఫెక్షన్ వంటివి సోకవు.
కీళ్ల నొప్పులతో బాధపడేవారు కూడా తమలపాకు తీసుకుంటే కాస్త వరకు ఉపశమనం లభిస్తుంది.ఇక రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే సామర్థ్యాన్ని తమలపాకులు కలిగి ఉన్నాయని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి.
ఇది ఆక్సీకరణ ఒత్తిడిని ఎదురుకోవడంలో కూడా ఉపయోగపడుతుంది.అలాగే రక్తంలో గ్లూకోస్ ను అదుపులో ఉంచుతుంది.