కీళ్లు అరిగిపోవడం లేదా వాపు రావడం లేదా బిగుసుకు పోవడం వల్ల నొప్పి పుడుతూ ఉంటుంది.వయసు పైబడిన వారిలో ఈ కీళ్ల నొప్పి సమస్య చాలా కామన్‌గా కనిపిస్తుంది.
అయితే ఇటీవల కాలంలో తక్కువ వయసు వారిని కూడా కీళ్ల నొప్పి సమస్య వేధిస్తుంది.పోషకాల లోపం, మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఏదైనా ఇన్ఫెక్షన్ ఇలా రకరకాల కారణాల వల్ల కీళ్ల నొప్పి సమస్య ఏర్పడుతుంది.దాంతో నొప్పి ఎలా నివారించుకోవాలో తెలియక.పెయిన్ కిల్లర్స్ వాడతారు.
కానీ, పెయిన్ కిల్లర్స్ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు.అందుకే న్యాచురల్‌గానే కీళ్ల నొప్పిని నివారించుకోవాలి.
ముఖ్యంగా కొబ్బరి పాలు ఈ సమస్యకు చెక్ పెట్టడంలో అద్భుతంగా సహాయపడతాయి.కొబ్బరి పాలు మంచి రుచి కలిగి ఉంటాయన్న సంగతి తెలుసు.
అయితే ఐరన్, క్యాల్షియం, సోడియం, ఫాస్ఫరస్, జింక్, పొటాషియం, ప్రోటీన్, విటమిన్ బి, విటిమన్ ఇ, గుడ్ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా అనేక పోషకాలు కూడా కొబ్బరి పాలలో దాగి ఉంటాయి.
అందుకే కొబ్బరి పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.
ముఖ్యంగా కీళ్ల నొప్పి ఉన్న వారు ప్రతి రోజు ఒక కప్పు కొబ్బరి పాలు తీసుకోవాలి.ఇలా చేస్తే కొబ్బరి పాలలో పుష్కలంగా ఉండే సెలీనియం అనే యాంటీ ఆక్సిడెంట్ కీళ్ల నొప్పి సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఇక కొబ్బరి పాలు తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పి సమస్య తగ్గడంతో పాటు.మెదడు చురుగ్గా పని చేస్తుంది.చర్మ సౌందర్యం రెట్టింపు అవుతుంది.ముఖంపై ముడతలు, ఏజ్ స్పాట్స్ రాకుండా ఉంటాయి.జుట్టుకు ప్రోటీన్ బాగా అంది ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.