విజయ్ సేతుపతి( Vijay Sethupathi ) తనదైన విలువలతో కెరియర్ ను, జీవితాన్ని కొనసాగిస్తున్న ఏకైక సౌత్ ఇండియన్ యాక్టర్ గా విజయ్ సేతుపతి పేరు చెప్పుకోవచ్చు.ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి పాత్ర చేయాల్సి వస్తుందో ఎవరు ఊహించగలరు చెప్పండి.
ఎలాంటి పాత్ర వచ్చిన సరే దానికి తగ్గట్టుగా రెమ్యూనరేషన్ కూడా వస్తుంది.అందుకే పాత్రతో సంబంధం లేకుండా చాలా మంది నటీనటులు అసలు కథ కూడా వినకుండా ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకుంటుంటారు.
కానీ వీటన్నింటికి విజయ్ సేతుపతి పూర్తిగా విరుద్ధం.అతడు ఉప్పెన సినిమాలో హీరోయిన్ కృతి శెట్టి( Kriti Shetty ) కి తండ్రిగా చేసిన విషయం మనందరికీ తెలిసిందే.
ఈ సినిమాలో కృతి శెట్టి తండ్రిగా నటించడంతో ఆయనకు తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది.అయితే కృతి శెట్టికి ఈ సినిమా ద్వారా గట్టి విజయమే లభించిన ఆ తర్వాత మరో రెండు విజయాలు కూడా లభించాయి.కానీ మూడు హిట్ సినిమాలు కొడితే నాలుగు ఫ్లాప్ సినిమాలు అన్నట్టుగా ఆమె కెరియర్ కొనసాగుతోంది.అయితే ఆమెకు తెలుగులో ప్రస్తుతం కొత్త గడ్డు కాలమే కనిపిస్తున్న కోలీవుడ్( Kollywood ) లో మాత్రం ఆమెకు మంచి అవకాశాలు వస్తుండటం విశేషం.
ఈ క్రమంలోని కృతి శెట్టికి విజయ సేతుపతి హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది.కానీ విజయ్ సేతుపతి మాత్రం కృతి శెట్టితో నటించే ప్రసక్తే లేదు అంటూ దర్శక నిర్మాతలకు చెప్పేశాడట.
అందుకు గల ప్రధాన కారణం సినిమాలో విజయ్ సేతుపతి మరియు క్రితి శెట్టి తండ్రి కూతుర్లుగా ఉప్పెన ( uppena ) సినిమాలో నటించారు.కూతురుగా నటించిన అమ్మాయితో మరో సినిమాలో రొమాన్స్ చేయడం అనేది తన విలువలకు విరుద్ధం అని అనుకున్నాడు కాబట్టి ఆమెను హీరోయిన్ గా తీసుకోవడానికి విజయ్ ఒప్పుకోలేదట.కానీ అలాంటి ఇబ్బందులు ఏమీ లేని కృతి శెట్టి విజయ్ సేతుపతి తో నటించడానికి సిద్ధంగా ఉండటం విశేషం.ఇలా చాల మంది నటులకు ఆఫర్స్ వస్తాయి కానీ అది చేయాలా లేదా అనేది మాత్రం సదరు హీరోల విలువలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.