ప్రస్తుత సమాజంలోని తల్లిదండ్రులు తమ పిల్లలు ఆహారం సరిగ్గా తీసుకోవడం లేదని చెబుతూ ఉంటారు.అలాగే ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలు ఆరోగ్యంగా, అందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు.
పిల్లలు పెద్దయ్యాక వారి కార్యక్రమాలు పెరుగుతూ ఉంటాయి.దీని వల్ల ఆహారం( Food ) పై శ్రద్ధ కూడా తగ్గుతూ ఉంటుంది.
అలాంటప్పుడు పిల్లలకు సరైన పోషకాహారం అందే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.కానీ పిల్లలు పెరుగుతున్న వయసులో శరీర పోషకాహారాన్ని సరైన మార్గంలో పొందడం ఎంత ముఖ్యం.
కాబట్టి వారి ఆహారం విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.పిల్లలు తమ ఆహారం నుంచి తగిన పోషక విలువలను పొందకపోతే వారిలోని రోగ నిరోధక శక్తి ( Immunity )తగ్గిపోతుంది.

అలాగే చిన్న వయసులోనే వారి శరీరం మరియు మెదడు తగినంత ఎదగదు.దీని కారణంగా పిల్లల శరీరక మరియు మేధో సామర్థ్యాలు అభివృద్ధి చెందవు.ఇది పిల్లల ఎదుగుదలను ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.దీని కోసం పిల్లల ఆహారం ఆరోగ్యంగా సంపూర్ణంగా ఉండడానికి వారి ఆహారంలో ఈ పదార్థాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.
ముఖ్యంగా చెప్పాలంటే పాలు, పాల ఉత్పత్తులలో ప్రోటీన్, అలాగే క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది.కాబట్టి మీరు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మీ ఆహారంలో పాలు( Milk ) మరియు పన్నీర్, చీజ్, మజ్జిగ,పెరుగు వంటి ఆహారాలను తప్పకుండా చేర్చుకోవాలి.

అలాగే డ్రై ఫ్రూట్స్( Dry fruits ) లో విటమిన్లు, ప్రోటీన్లు, మెగ్నీషియం,హెల్తీ ఫ్యాట్స్, లిపిడ్లు చాలా ఎక్కువగా ఉంటాయి.కాబట్టి చిరుతిండి తినే సమయంలో పిల్లలకు తప్పకుండా డ్రై ఫ్రూట్స్ ను ఇవ్వాలి.ముఖ్యంగా చెప్పాలంటే అత్తి పండ్లు,ఎండుద్రాక్షలు లాంటి డ్రై ఫ్రూట్స్ పిల్లలకు ఇస్తూ ఉండాలి.అలాగే పిల్లలు తక్కువ బరువుతో ఉంటే అరటి పండ్లు ( Bananas )బరువు పెరగడానికి ఎంతో ఉపయోగపడతాయి.
అరటి పండ్లలలో పొటాషియం, విటమిన్ సి, ఈ, కె పుష్కలంగా ఉంటాయి.అలాగే ఇందులో ఉండే ఒమేగా త్రి ఫ్యాటీ యాసిడ్ పిల్లల ఆరోగ్యానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి.
అలాగే క్రమం తప్పకుండా పిల్లలు తీసుకునే ఆహారంలో తాజా కూరగాయలు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి.