భారత దేశంలో వివిధ ప్రాంతాలలో శివాలయాలు ఎంతో ప్రసిద్ధిచెందినవి.కోరిన కోర్కెలు తీర్చే ఈ పరమేశ్వరుడు వివిధ రకాల పేర్లతో భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు.
ఈ తరహాలోనే రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం రాయికల్ గ్రామ శివారులోని పంచముఖ గుట్టపై సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ప్రతిష్టించిన రామలింగేశ్వరుడు కొలువై ఉన్నాడని చరిత్ర చెబుతోంది.ఉత్తర రామేశ్వరం గా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో శివలింగాన్ని సాక్షాత్తు ఆ శ్రీరాముడి ప్రతిష్టించాడని పూర్వీకులు తెలియజేస్తున్నారు.
ఈ శివ లింగాన్ని ఆ గుట్టపై శ్రీరామచంద్రుడే ప్రతిష్టించాడని అనడానికి నిదర్శనంగా దానిపై రామ బాణం గుర్తు ఉంటుంది.శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు సీతను అపహరించిన రావణాసురుణ్ణితో పోరాటం చేసే సీతను తన వెంట పెట్టుకుని సతీసమేతంగా తిరిగి అయోధ్యకు వెళ్తున్న సమయంలో దండకారణ్య ప్రాంతమైన రామేశ్వరంలోని బదరీ వృక్షం కింద శివలింగాన్ని ప్రతిష్టించి పూజలు చేసాడని చరిత్ర చెబుతోంది.
అయితే కొన్ని వైపరీత్యాల వల్ల ఆ వృక్షం కింద ఉన్న శివలింగం రానురాను మట్టిలో కలిసి పోయింది.ఈ కొండల మధ్య మాణిక్య ప్రభు శిష్యుడైన నరసింహరాయలుతపస్సు చేస్తుండగా ఆయన కలలో రామలింగేశ్వరుడు కనిపించి ఆ వృక్షము కింద శివలింగం ఉందని, దానిని బయటకు తీసి పూజలు జరిపించాలని చెప్పి అదృశ్యమయ్యారు.
దీంతో ఆయన బదరీ వృక్షం కింద ఉన్న శివలింగాన్ని వెలికి తీసి పూజలు చేయటం ప్రారంభించాడు.
![Telugu Shiva Linga, Lord Rama, Mahboobnagar-Telugu Bhakthi Telugu Shiva Linga, Lord Rama, Mahboobnagar-Telugu Bhakthi](https://telugustop.com/wp-content/uploads/2020/11/lord-rama-erected-shiva-linga-panchamukha-gutta-ramalingeswara-temple-mahboobnagar.jpg)
తరువాత నరసింహరాయల శిష్యులు అప్ప కొండభట్టు దత్తాత్రేయ స్వామి ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి.ప్రస్తుతం ఈ ఆలయంలో ప్రతి ఏటా శివరాత్రి రోజున ఎంతో ఘనంగా స్వామి వారికి పూజలు నిర్వహిస్తారు.శివరాత్రి పండుగ రోజున పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి చేరుకొని స్వామి వారిని దర్శించుకుంటారు అయితే ఈ ఆలయంలో ఉన్న శివలింగం ప్రతి సంవత్సరం పెరుగుతూ, పగుళ్ళు ఏర్పడుతున్నాయి.
ఇంతటి మహత్తర శివలింగాన్ని సాక్షాత్తు శ్రీరాముడు ప్రతిష్టించడం ఎంతో విశేషం.
LATEST NEWS - TELUGU