పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంత కష్టపడతారో మనకు తెలిసిందే.పిల్లల విజయాన్ని చూసి ఆనందించడం, వారి కలలు నిజమయ్యేందుకు ప్రోత్సహించడం ప్రతి తల్లిదండ్రి చేసేపని.
అలాంటి సంఘటనే ఇటీవల బిగ్‌బాష్ లీగ్‌లో( Big Bash League ) చోటుచేసుకుంది.క్రికెటర్‌గా ఎదగాలని కలలు కన్న తన కొడుకు మ్యాచ్‌లో అదరగొడతాడని ఆశించిన తండ్రి, అనూహ్యంగా తన కొడుకు బౌలింగ్‌లో ప్రత్యర్థి బ్యాటర్ సిక్స్ కొట్టి స్టాండ్స్‌లోకి పంపితే, ఆ బంతిని లైవ్‌లోనే క్యాచ్ పట్టాడు.
ఈ సంఘటన బిగ్‌బాష్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్,( Adelaide Strikers ) బ్రిస్బేన్ హీట్( Brisbane Heat ) మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది.అడిలైడ్ స్ట్రైకర్స్ బౌలర్ లియామ్ హస్కెట్( Liam Haskett ) బౌలింగ్‌లో బ్రిస్బేన్ బ్యాటర్ భారీ సిక్స్ కొట్టాడు.దాంతో ఆ బంతి కాస్త స్టాండ్స్‌లో కూర్చున్న ఆడియెన్స్ వద్ద పడింది.అయితే, బాల్ వెళ్లి పడే స్థానంలో అక్కడే కూర్చున్న హస్కెట్ తండ్రి ఆ బంతిని పట్టేశాడు.
ఈ ఘటన మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.తన కొడుకు బౌలింగ్‌పై వచ్చిన సిక్స్‌ను తానే క్యాచ్ పట్టడం ఆ తండ్రికి ప్రత్యేక అనుభూతిని కలిగించింది.
లియామ్ హస్కెట్ తండ్రి ఈ క్యాచ్‌ను సెలబ్రేట్ చేస్తూ ఆనందపడ్డాడు.నవ్వుతూ అందరి అభినందనలు అందుకున్నాడు.అయితే, అతని పక్కనే కూర్చున్న సతీమణి మాత్రం కొడుకు బౌలింగ్‌పై సిక్స్ రావడంతో నిరాశలో మునిగిపోయింది.ఆమె ముఖం పై ఆవేదన స్పష్టంగా కనిపించింది.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.లియామ్ హస్కెట్ తన తొలి ఓవర్లో నిరాశపరిచినా, ఆ తర్వాత కీలక రెండు వికెట్లు తీసి జట్టుకు మద్దతు అందించాడు.3 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.అడిలైడ్ స్ట్రైకర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 251 పరుగులు చేయగా, ఛేజింగ్‌కు దిగిన బ్రిస్బేన్ హీట్ 195 పరుగులకే పరిమితమైంది.