అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే వినూత్న నిర్ణయాలతో ప్రపంచాన్ని , అమెరికన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్.( Donald Trump ) విదేశీయులకు పుట్టే పిల్లలకు జన్మత: అమెరికా పౌరసత్వానికి సంబంధించి ఆయన తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ దుమారం రేపడంతో పాటు కోర్టులు కలగజేసుకోవాల్సి వచ్చింది.తాజాగా ట్రంప్ పరిపాలనా యంత్రాంగంలో( Trump Administration ) పనిచేయాలని ఆశిస్తున్న ఉద్యోగార్ధులు తీవ్ర పరీక్షలను ఎదుర్కొంటున్నారు.వైట్‌హౌస్( White House ) బృందాలు .MAGA (మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ ) బోనాఫైడ్స్ తనిఖీ కోసం ప్రభుత్వ సంస్థల వరకు వెళ్తున్నాయి.
ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు డొనాల్డ్ ట్రంప్ విధానాలను అమలు చేయడానికి తమ ఉత్సాహాన్ని నిరూపించుకోవాలని నిబంధనలు చెబుతున్నాయి.ప్రతికూల సోషల్ మీడియా పోస్టులు వారి దరఖాస్తులను తిరస్కరించడానికి దారి తీశాయని అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది.అలాగే ఓ వెబ్‌సైట్‌లో ట్రంప్ ప్రచార సందేశంలో ఏ భాగం మీకు అత్యంత ఆకర్షణీయంగా అనిపించింది అని ప్రశ్నించింది.2024 ఎన్నికల్లో ట్రంప్ కోసం స్వచ్ఛంద సేవ, నిధుల సేకరణ, ఫోన్ కాల్స్ ఇలా ఏ రకమైన మద్ధతు ఇచ్చారో వివరించాలని కూడా ప్రశ్నించింది.
ఈ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌పై పలు విమర్శలు వస్తున్నాయి.వారు సాధారణ యువకులని, వారు పనిచేస్తున్న ఏజెన్సీల దస్త్రాలలో ప్రత్యేక నైపుణ్యం, నేపథ్యం ఉన్నట్లు కనిపించడం లేదని కొందరు అధికారులు అంటున్నారు .స్క్రీనర్లుగా విధులు అప్పగించిన వారు అభ్యర్ధులకు MAGA ఉద్యమం, అమెరికా ఫస్ట్( America First ) నినాదాలకు మధ్య స్వల్ప తేడాను వెతుకుతున్నట్లుగా కనిపిస్తోందన్నారు.ప్రతికూల సోషల్ మీడియా పోస్ట్, ట్రంప్ ప్రత్యర్ధితో అభ్యర్ధులు ఫోటో దిగినా దరఖాస్తును తిరస్కరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ట్రంప్ తొలిసారిగా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి లక్ష్యంగా చేసుకున్న విదేశాంగ శాఖలో మానసిక స్ధితి ఉద్రిక్తంగా ఉందని నివేదికలు చెబుతున్నాయి.
కెరీర్ సివిల్, విదేశాంగ శాఖ అధికారులు కొత్త రాజకీయ నాయకుల నుంచి ప్రతీకారం ఎదుర్కోవాల్సి వస్తోందని నిపుణులు చెబుతున్నారు.