స్కిన్ పిగ్మెంటేషన్.( Skin Pigmentation ) చాలా మందిని కలవర పెట్టే చర్య సమస్య ఇది.
హార్మోన్ల అసమతుల్యత, ఎక్కువగా ఎండల్లో ఉండటం, వయసు ప్రభావం, థైరాయిడ్, కొన్ని రకాల మందుల వాడకం, పోషకాల కొరత, ఏమైనా గాయాలు కావడం, ఇన్‌ఫెక్షన్లు తదితర కారణాల వల్ల స్కిన్ అనేది పిగ్మెంటేషన్ కు గురవుతుంది.ఫలితంగా స్కిన్ కలర్ అన్ ఈవెన్ గా మారిపోతుంది.
చర్మంపై డార్క్ ప్యాచెస్ ఏర్పడుతుంటాయి.వీటి వల్ల ముఖాన్ని అద్దంలో చూసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు.
ఈ క్రమంలోనే స్కిన్ పిగ్మెంటేషన్ సమస్య నుంచి బయటపడటానికి రకరకాల ఉత్పత్తులు వాడుతుంటారు.
కానీ పైసా ఖర్చు లేకుండా కూడా స్కిన్ పిగ్మెంటేషన్ ను వదిలించుకోవచ్చు.
అందుకు రైస్ వాటర్( Rice Water ) అద్భుతంగా తోడ్పడతాయి.రైస్ వాటర్‌లో ఫెరిక్ యాసిడ్ మరియు అలాంటొయిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి చర్మానికి నష్టాన్ని కలిగించే ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.
అలాగే రైస్ వాటర్ లోని ఫెరిక్ యాసిడ్ మెలానిన్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది.విటమిన్ బి3( Vitamin B3 ) పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది.
టాన్ మరియు డార్క్ స్పాట్స్ ను తొలగించి చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిపించడంతో రైస్ వాటర్ తోడ్పడుతుంది.
అందుకోసం ముందుగా ఒక కప్పు బియ్యాన్ని తీసుకుని వాటర్ తో ఒకసారి కడిగి ఒకటిన్నర కప్పు నీరు పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు రైట్ వాటర్ ను ఫిల్టర్ చేసుకుని గది ఉష్ణోగ్రత వద్ద రెండు రోజులు ఉంచితే ఫెర్మెంటేషన్ జరుగుతుంది.ఇప్పుడు ఈ రైస్ వాటర్ ను ఫేస్ టోనర్ గా ఉపయోగించవచ్చు.
రైస్ వాటర్ ను స్ప్రే బాటిల్ లో నింపుకుని రోజూ ఉదయం, సాయంత్రం స్నానం చేసిన తర్వాత ముఖానికి స్ప్రే చేసుకోవాలి.
అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ముల్తానీ మట్టి( Multhani Mitti ) మరియు సరిపడా రైస్ వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పూర్తిగా ఆరిన తర్వాత కడిగేయాలి.వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ వేసుకోవాలి.
రైస్ వాటర్ ను ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఉపయోగించడం అలవాటు చేసుకుంటే స్కిన్ పిగ్మెంటేషన్ సమస్యకు గుడ్ బై చెప్పవచ్చు.చర్మాన్ని అందంగా, కాంతివంతంగా మెరిపించుకోవచ్చు.