తేనెను ఇలా తీసుకుంటే రిస్క్‌లో ప‌డ‌తారు.. జాగ్ర‌త్త‌!

తేనె.ఎంత రుచిగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.తియ్య‌ని తేనెను అంద‌రూ ఎంతో ఇష్ట‌ప‌డ‌తారు.ఇక రుచిలోనే కాదు.ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు అందించ‌డంలోనూ.అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేయ‌డంలోనూ తేనె గ్రేట్‌గా స‌హాయ‌ ప‌డుతుంది.

 Taking Honey Like This Puts You At Risk! Honey, Health, Health Tips, Benefits Pf-TeluguStop.com

ముఖ్యంగా బ‌రువు త‌గ్గాల‌నుకునే తేనెను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటారు.ఎందుకంటే, అధిక బరువును త‌గ్గించ‌డంతో తేనె బాగా ఉప‌యోగ‌డ‌ప‌తుంది.

అలాగే తేనెను తీసుకోవ‌డం వ‌ల్ల.అందులో ఉండే విట‌మిన్ సి శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని బ‌ల‌ప‌రుస్తుంది.

ఫ‌లితంగా హానికరమైన బాక్టీరియా, వైర‌స్‌ల‌ నుండి శరీర వ్య‌వ‌స్థ‌కు ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.అయితే తేనె విష‌యంలో చాలా మంది కామ‌న్‌గా ఓ పొర‌పాటు చేస్తుంటారు.

ఉద‌యం లేదా రాత్రి ఇలా ఏదో ఒక స‌మ‌యంలో వేడి వేడి ప‌దార్థాల్లో క‌లిపి తేనెను తీసుకుంటారు.ముఖ్యంగా వేడి నీటిలో లేదా వేడి పాల‌లో క‌లిసి తేనెను సేవిస్తుంటారు.

ఇంకొంద‌రు వేడి టీలో క‌లుపుకుని తేనెను తీసుకుంటారు.

కానీ, వాస్త‌వానికి వేడి పదార్థాల్లో కలిపి తేనెను తినకూడదు.

ఎందుకంటే, ఇలా వేడి పదార్థాల్లో తేనెను కలిపినప్పుడు.తేనెలో కలిసి ఉండే మైనం విషంగా మారే ప్రమాదం ఉంది.

ఫ‌లితంగా అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.కాబట్టి ఈ పద్ధతిని మానుకుంటే మంచిది.

అయితే వేడి వేడిగా ఉండే ప‌దార్థాల్లో కాకుండా.కాస్త గోరు వెచ్చ‌గా ఉండే వాటిలో క‌లిపి  తేనె ను  తీసుకోవ‌చ్చు.

అలాగే చేయ‌డం వ‌ల్ల ఎలాంటి హాని ఉండ‌దు.మ‌రియు ఆరోగ్యానికి కూడా మేలు జ‌రుగుతుంది.

ముఖ్యంగా గోరు వెచ్చ‌ని నీటిలో తేనె క‌లిపి ఉద‌యాన్నే తీసుకోవ‌డం వ‌ల్ల జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.మ‌రియు రోజంతా యాక్టివ్‌గా కూడా ఉంటారు.

ఇక రాత్రి స‌మ‌యంలో గోరు వెచ్చ‌ని పాల‌లో తేనె క‌లిపి తీసుకుంటే నిద్ర త్వ‌ర‌గా ప‌డుతుంది.నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న వారికి ఇది బెస్ట్ ఆప్ష‌న్‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube