ప్రపంచంలో HIV తో బాధపడుతున్న పేషెంట్లలో అధికశాతం ఆడవారే ఉండటం గమనార్హం.ఈ వ్యాధి కారణంగా 15-50 నుంచి మధ్య వయసు గల మహిళలు ఎంతోమంది చనిపోతున్నారు.
స్వతహాగా ఆడవారి శరీరం మగవారి శరీరంతో పోలిస్తే చాలా సెన్సిటివ్.అందుకే మహిళలు జాగ్రత్తగా ఉండాలి.
ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి స్త్రీలను రక్షించేందుకు ఒక సరికొత్త మార్గంతో వచ్చారు పరిశోధకులు.HIV ముందు రక్షణకవచంలా పనిచేసే ఓ రింగ్ ని తయారుచేసారు ఇంటర్నేషనల్ పార్టనర్షిప్ ఫర్ మైక్రోబసైడ్స్ (IPM) పరిశోధకులు.
దీని పేరు డప్విరైన్ (dapivirine) రింగ్.దీన్ని వెజైనల్ రింగ్ అని కూడా అంటారు.
ఈ రింగ్ ని స్త్రీ యోనిలో పెడతారు.ఈ రింగ్ నుంచి మెల్లిమెల్లిగా “డప్విరైన్” అనే యాంటిరెట్రోవైరల్ (ARV) విడుదల అవుతూ ఉంటుంది.ఇది కొత్తగా HIV ఇంఫెక్షన్ సోకిన స్త్రీ యోనిలో పెడితే, అది వైరస్ యొక్క ఇంఫెక్షన్ త్వరగా హాని చేయకుండా, వైరస్ త్వరగా పెరగకుండా పోరాడుతుంది.అయితే ఈ రింగ్ ని ప్రతీ 21 రోజులకి ఓసారి మారుస్తూ ఉండాలి.
ఈ రింగ్ ని ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా, ఉగాండ, జింబాబ్వే, మలవై దేశాల్లో టెస్ట్ చేస్తున్నారు.ఈ రింగ్ 75% కేసుల్లో మంచి ఫలితాలని చూపించిందని పరిశోధకులు తెలిపారు.