జుట్టు కుదుళ్లు ఎంత బలంగా ఉంటే హెయిర్ ఫాల్ సమస్య అంత తక్కువగా ఉంటుంది.జుట్టు కుదుళ్లు బలహీనం అయ్యే కొద్ది హెయిర్ ఫాల్ సమస్య విపరీతంగా పెరిగిపోతుంది.
అందుకే జుట్టు కుదుళ్లను బలంగా మార్చుకోవాలని నిపుణులు చెబుతూ ఉంటారు.అందుకు పోషకాహారం తీసుకోవడమే కాదు కొన్ని కొన్ని ఇంటి చిట్కాలను కూడా పాటిస్తూ ఉండాలి.
ముఖ్యంగా ఇప్పుడు చేయబోయే చిట్కాలను వారానికి ఒకసారి పాటిస్తే బలహీనమైన జుట్టు కుదుళ్లు బలంగా మారుతాయి.తద్వారా హెయిర్ ఫాల్ సమస్య క్రమంగా అదుపులోకి వస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం జుట్టు కుదుళ్లను బలంగా మార్చే ఆ చిట్కాలు ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని వాటర్ పోయాలి.
వాటర్ హిట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్ల గ్రీన్ టీ పౌడర్ వేసి బాగా మరిగించి గ్రీన్ టీ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ గ్రీన్ టీ లో నాలుగు చుక్కలు టీట్రీ ఎసెన్షియల్ ఆయిల్‌ను మిక్స్ చేసి స్ప్రే బాటిల్లో నింపుకోవాలి.నైట్ నిద్రించే ముందు ఈ గ్రీన్ టీ ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు స్ప్రే చేసుకుని పడుకోవాలి.మరుసటి రోజు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ కరివేపాకు పొడి, వన్ టేబుల్ స్పూన్ వేపాకు పొడి, మూడు టేబుల్ స్పూన్ల పెరుగు, వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకుని గంట పాటు షవర్ క్యాప్ ధరించాలి ఆపై మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.ఈ రెండు చిట్కాలను వారానికి ఒకసారి పాటిస్తే జుట్టు కుదుళ్లు బలంగా మారుతాయి.
దాంతో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.అదే సమయంలో హెయిర్ డ్యామేజ్, చుండ్రు వంటి సమస్యలు సైతం దూరం అవుతాయి.