రంజాన్ ( Ramzan ) ఈ ఏడాది మార్చి 24వ తేదీన మొదలై ఏప్రిల్ 22వ తేదీ వరకు కొనసాగుతుంది.మార్చి నెల రోజులు ముస్లింలు ఉపవాసం ( Fasting ) ఉంటారు.
సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు ఏమీ తినకుండా ఉంటారు.సాయంత్రం సూర్యాస్తమయం లో ఆహారాన్ని తిని ఉపవాసాన్ని విరమిస్తారు.
ఈ మాసంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఎంతో పవిత్రంగా వారి యొక్క పద్ధతిని పాటిస్తూ ఉంటారు.మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ముస్లింలు కూడా ఎంతో పవిత్రంగా రంజాన్ పండుగ ను భావించి నియమ నిబంధనలను అనుసరిస్తూ ఉంటారు.
ముఖ్యంగా చెప్పాలంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖాళీ కడుపుతో కఠిన ఉపవాసాన్ని పాటిస్తారు.

రంజాన్ మాసానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఉపవాసం గురించి సైన్స్ కూడా కొన్ని విషయాలను చెబుతోంది.ఉపవాసం ఉంటే శరీరంతో పాటు మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుందని సైన్స్ చెబుతోంది.
రంజాన్ ఉపవాసం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఉపవాసం చేయడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.
మెదడు సరిగ్గా పనిచేస్తుంది.అంతే కాకుండా జ్ఞాపక శక్తి( Memory power ) పెరగడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా చెప్పాలంటే ఉపవాసం ఉండడం వల్ల ఒత్తిడి, కొలెస్ట్రాల్ ఇబ్బందులు కూడా దూరమవుతాయి.ఉపవాసం ఉండడం వల్ల అధిక రక్తపోటు సమస్య కూడా దూరమవుతుంది.

రంజాన్ ఉపవాసం పాటించే షుగర్ పేషెంట్లకు( Diabetes ) కూడా ఇది ఎంతో మంచిది.బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.కానీ షుగర్ పేషెంట్లు ఒకసారి డాక్టర్ సలహా తీసుకోవడం ఎంతో మంచిది.ముఖ్యంగా చెప్పాలంటే శరీరం ఇన్ఫెక్షన్ తో పోరాడితే వాపు పెరుగుతుంది.ఉపవాసం వాపు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.ఇంకా చెప్పాలంటే క్యాన్సర్, ఆర్థరైటిస్, గుండె జబ్బులు ఉన్నవాళ్లలోని మంటను తగ్గించుకోవాలంటే ఉపవాసం ఉండడం మంచిది.
ముఖ్యంగా చెప్పాలంటే ఉపవాసం వల్ల కేలరీలు తగ్గుతాయి.అందువల్ల అధిక బరువు అదుపులో ఉంటుంది.
అందువల్ల రంజాన్ ఉపవాసం పాటించడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.