అపోలో హాస్పిటల్ వైస్ చైర్ పర్సన్, మెగా కోడలు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ramcharan) సతీమణి ఉపాసన(Upasana) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అపోలో ఫౌండేషన్ వైస్ చైర్పర్సన్ గా ఈమె ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎంతోమంది ఆదరణ సంపాదించుకున్నారు.
ఇలా మెగా కోడలుగా ఒకవైపు బాధ్యతలను చేపడుతూనే మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.ఇలా సామాజిక సేవ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నందుకుగాను ఉపాసనకు అరుదైన గౌరవం లభించింది.

ఇప్పటికే రామ్ చరణ్ నటించిన సినిమాకు ఆస్కార్ అవార్డు (Oscar Award)రావడంతో మెగా కుటుంబం సంబరాలు చేసుకుంటున్నారు.ఈ క్రమంలోనే మెగా కోడలు కూడా మరొక ఘనత సాధించడంతో మెగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇటీవల ఈమె మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ ఆసియా 2022-23 జాబితాలో ఒకరిగా నిలిచారు.ఉపాసన చేసిన సేవలకు గాను అవార్డు లభించినట్లు ఎకనామిక్స్ టైమ్స్ వెల్లడించారు.ఇక ఈ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ విధంగా ఉపాసన ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డుకు ఎంపిక కావడంతో ఎంతోమంది అభిమానులు ఈమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఒకవైపు కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూనే మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలలో ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు అంటూ ఈమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇక ఉపాసన అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్ పర్సన్ గా మాత్రమే కాకుండా బి పాజిటివ్ అనే హెల్త్ మ్యాగజైన్ కు ఎడిటర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.అలాగే యు ఎక్స్చేంజ్ అనే సంస్థను నెలకొల్పి పాత స్కూల్ పుస్తకాలను సేకరించి పేద పిల్లలకు అందజేస్తున్నారు.
అలాగే మురికివాడలో ఉన్నటువంటి వారికి అపోలో హెల్త్ సిటీలో వైద్యం అందిస్తున్నారు.ఇలా ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నటువంటి ఉపాసన సేవలను గుర్తించి ఆమెకు ఈ అవార్డు ప్రకటించినట్లు తెలుస్తుంది.







