2019 లోక్ సభ( Lok Sabha ) ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలో మోడీపై రాహుల్ గాంధీ( Rahul Gandhi ) సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.దొంగలందరికీ మోడీ ( Modi )అనే ఇంటి పేరు ఎందుకుంటుందో అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
దీంతో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ సూరత్ న్యాయస్థానంలో పరువు నష్టం దావా వేయడం జరిగింది.దాదాపు నాలుగు సంవత్సరాలు తర్వాత దీనిపై ఇటీవల విచారించిన సూరత్ కోర్టు.
రాహుల్ గాంధీకి రెండేళ్ల పాటు జైలు శిక్ష విధించింది.

ఈ పరిణామంతో ఏదైనా కేసులో నిందితులుగా తేలి జైలు శిక్ష పడిన వారికి ఎన్నికలలో ప్రజాప్రతినిధిగా కొనసాగే అవకాశం ఉండదంటూ.ప్రజా ప్రాతినిధ్యం చట్టంలో చేసిన మార్పులకు అనుగుణంగా లోక్ సభ రాహుల్ పై అనర్హత వెయిట్ వేయడం జరిగింది.రాహుల్ ని అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్ సభ సెక్రటరీ జనరల్ పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఈ ప్రకటన కాంగ్రెస్ శ్రేణులను దిగ్భ్రాంతికి గురిచేసింది.సూరత్ కోర్టు తీర్పు మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు మార్చి 23 నుంచే అనర్హత అమల్లోకి వస్తుందని లోక్ సభ సెక్రటరీ జనరల్ స్పష్టం చేశారు.







