1.నారా లోకేష్ పాదయాత్ర
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈనెల 27 నుంచి పాదయాత్రను ప్రారంభించనున్న నేపథ్యంలో ఆయన బుధవారం హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులర్పించమన్నారు.
2.మంత్రి వాహనానికి ప్రమాదం
నారాయణపేట జిల్లాలోని మక్తల్ మండలం జక్కులేరు వద్ద మంత్రి నిరంజన్ రెడ్డి వాహనం ప్రమాదానికి గురైంది.మంత్రి వాహనాన్ని వరి కోత మిషన్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
3.జనసేన బీజేపీ పొత్తుపై టీజీ వెంకటేష్ కామెంట్స్
జనసేన బిజెపి మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తెలిపారు ఎన్నికల కోసమే జనసేన బిజెపిల మధ్య పొత్తు అని స్పష్టం చేశారు.
4.సోము వీర్రాజు కామెంట్స్
రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.
5.ఎస్సై కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన
హైదరాబాదులోని గాంధీ భవన్ వద్ద ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు.ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
6.బండి సంజయ్ కామెంట్స్
తెలంగాణ ప్రజలు పూర్తి నిరాశా, నిస్పృహ, ఆందోళనలో ఉన్నారని , ప్రజలకు ఆత్మవిశ్వాసం భరోసా కల్పించే పార్టీ బిజెపి అని ప్రజలు భావిస్తున్నారని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
7.జనసేన నేతల పూజలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టబోతున్న వారాహి రథయాత్ర విజయవంతం కావాలని కొందగుట్ట ఆంజనేయస్వామి ఆలయంలో జనసేన నేతలు పూజలు నిర్వహించారు.
8.షర్మిల పాదయాత్ర
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల పాదయాత్ర ఈనెల 28 నుంచి తిరిగి ప్రారంభం కానుంది.
9.జనగామ ఎమ్మెల్యే నిండి ముట్టడికి కాంగ్రెస్ ప్రయత్నం
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు.
10.పొత్తులపై పవన్ కామెంట్స్
ఎన్నికల పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.ఎన్నికల సమయంలోనే పొత్తుల పై స్పష్టత వస్తుందని అన్నారు.
11.ఢిల్లీలో భూకంపం
దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో బలమైన ప్రకంపనాలు సంభవించాయి.మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది.రిక్తార్ స్కేల్ పై 5.8 గా నమోదయింది.
12.వారాహికి పూజలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగుట్ట అంజన్న దేవస్థానంలో స్వామివారిని దర్శించుకున్నారు.అనంతరం తన ఎన్నికల ప్రచార వాహనం ద్వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
13.ఏపీ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కామెంట్స్
ఏపీ ప్రభుత్వంపై కేంద్రమంత్రి దేవ్ సింహ చౌహన్ సంచలన విమర్శలు చేశారు.అతి తక్కువ సమయంలో ఏపీ ప్రభుత్వం ప్రజాదారణ కోల్పోయిందని ఆయన విమర్శించారు.
14.టిడిపి అధిష్టానం పై రాయపాటి సంచలన కామెంట్స్
గుంటూరు జిల్లా టిడిపి సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.రాజకీయాల్లో కష్టపడి పనిచేసే వారికి టిక్కెట్లు ఇవ్వాలని, తమ కుటుంబంలో రెండు సీట్లు ఇవ్వాలని చంద్రబాబునాయుడుని అడిగాము అని, నరసరావుపేట ఎంపీ సీటు కడప వాళ్లకు ఇస్తే ఓడిస్తామని హెచ్చరించారు.
15.నేడు అంగప్రదక్షిణం టోకెన్లు విడుదల
తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది.ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లను టిటిడి విడుదల చేసింది.
16.జీవో నెంబర్ ఒకటిపై హైకోర్ట్ లో విచారణ
జీవో నెంబర్ ఒకటిపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.
17.బిజెపి బూత్ కమిటీ శక్తి కేంద్రాల సమావేశం
నేడు కర్నూలు జిల్లా కోడుమూరులో బిజెపి బూత్ కమిటీ శక్తి కేంద్రాల సమావేశం జరిగింది .దీనికి కేంద్ర మంత్రి దేవ్ సింహ చౌహాన్ హాజరయ్యారు.
18.నేడు సిద్దిపేటలో హరీష్ రావు పర్యటన
నేడు సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు.పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నారు.
19.ఆర్టీసీ ఎండి సజ్జనార్ ట్విట్టర్ అకౌంట్ హ్యాిక్
ఆర్టీసీ ఎండి సజ్జనార్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 52,700
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 57,490
.