పెద్ద ఎత్తున రేషన్ బియ్యం కాకినాడ పోర్ట్( Kakinada Port ) ద్వారా విదేశాలకు అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపించడమే కాకుండా , రెండు రోజుల క్రితం కాకినాడ పోర్ట్ లో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హడావుడి చేశారు.షిప్పుల్లో తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తోందనే అనుమానంతో సీజ్ చేయాల్సిందిగా పవన్ ఆదేశించారు.దీంతో ‘ సీజ్ ది షిప్ ‘( Seize The Ship ) అనే వ్యాఖ్యలు ట్రెండింగ్ గా మారాయి.
అయితే పవన్ చెప్పినంత ఈజీగా షిప్ ను సీజ్ చేయడం సాధ్యం కాదని, అంతర్జాతీయంగా ఈ ప్రభావం ఉంటుందని, అసలు దీనిపై చర్యలు తీసుకోవాల్సిన కస్టమ్స్ అధికారులు సైతం బియ్యం రవాణాపై ఎటువంటి ఆంక్షలు తమ పరిధిలో లేవని తేల్చి చెప్పడం, దీనిపై రాజకీయంగాను రచ్చ జరుగుతోంది.అసలు పవన్ కళ్యాణ్ టూర్ పైన అనేక సందేహాలు వ్యక్తం చేస్తూ వివిధ రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి.
స్టెల్లా షిప్ ను తనిఖీలు చేశారు సరే, కెన్ స్టార్ షిప్ ను ఎందుకు వదిలి పెట్టారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.ఈ మేరకు మాజీమంత్రి పేర్ని నాని( Perni Nani ) ఈ అంశాన్ని ప్రశ్నిస్తున్నారు .కెన్ స్టార్ షిప్ లో 42 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఉందని ఆయన ఆరోపించారు.ఆర్థిక శాఖ మంత్రి వియ్యంకుడి షిప్ కనుకనే దాన్ని ఉపేక్షించారంటూ పేర్ని నాని మండిపడ్డారు.
ఎందుకు తనిఖీ చేయలేదంటూ ప్రశ్నించారు .ఇక ఇదే అంశంపై ఏపీ కాంగ్రెస్ కూడా స్పందించింది.రేషన్ బియ్యం తరలింపు వెనుక పెద్ద సైజు మాఫీయా ఉందని ఆరోపించింది.ఇదొక జాతీయస్థాయి కుంభకోణమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు షర్మిల విమర్శించారు.అవినీతి అధికారుల ప్రమేయం ఉందని , ఎవరికి దక్కాల్సిన వాటా వాళ్లకు చేరుతుండడంతో నిఘా వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని అన్నారు.
మొత్తం ఈ వ్యవహారం పై సిబిఐతో విచారణ జరిపించాలని షర్మిల( Sharmila ) డిమాండ్ చేశారు.రేషన్ బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న మాట నిజం, దాన్ని అరికట్టడంలో అధికారులు విఫలమైన మాట నిజం అని టిడిపి కూడా ఒప్పుకుంటుంది .అందుకే పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ప్రక్షాళన మొదలు పెట్టారని చెబుతోంది.ఈ వ్యవహారం ఇలా ఉండగానే ఇదే అంశంపై జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబు రెండు గంటలపాటు ఈ వ్యవహారంపై మంతనాలు చేశారు.పాలనాపరమైన అనేక అంశాలు, రాజకీయ అంశాల పైన కూడా సుదీర్ఘంగా చర్చించారు .కాకినాడ పోర్ట్ నుంచి బియ్యం అక్రమ రవాణా వ్యవహారాల పైన చర్చించారు.కాకినాడ పోర్ట్ స్మగ్లింగ్ కు అడ్డాగా మారిందని , రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారని, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని పవన్ కోరుతున్నారు.