ముఖ చర్మం ఫ్రెష్ గా మరియు క్లీన్ గా ఉండాలంటే కచ్చితంగా రోజుకు రెండు సార్లు అయినా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల ముఖంపై పేరుకుపోయిన మురికి, మలినాలు తొలగిపోతాయి.
తద్వారా ఎన్నో చర్మ సమస్యలు దరిచేరకుండా అడ్డుకోవచ్చు.అందుకే చాలా మంది తమ స్కిన్ కి సూట్ అయ్యే ఫేస్ వాష్ ను మార్కెట్లో కొనుగోలు చేసి వాడుతుంటారు.
అయితే మార్కెట్లో లభ్యమయ్యే ఫేస్ వాష్‌లు ఖరీదైనవే కాదు వాటిలో ఎన్నో కెమికల్స్ కూడా నిండి ఉంటాయి.
అటువంటి ఫేస్ వాష్ లు వాడటం వల్ల భవిష్యత్తులో పలు రకాల చర్మ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కానీ ఇప్పుడు చెప్పబోయే హోం మేడ్ ఫేస్ వాష్ పౌడర్‌ను ఉపయోగిస్తే ముఖ చర్మం క్లీన్ అండ్ ఫ్రెష్ గా మారడమే కాదు మరెన్నో స్కిన్ కేర్ బెనిఫిట్స్ ను కూడా పొందొచ్చు.మరి ఇంతకీ ఆ ఫేస్ వాష్ పౌడర్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల చందనం పొడి, రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి, రెండు టేబుల్ స్పూన్ల ఎర్ర కంది పప్పు పొడి, రెండు టేబుల్ స్పూన్ల మందారం పువ్వుల పొడి, రెండు టేబుల్ స్పూన్ల వేపాకుల పొడి, వన్ టేబుల్ స్పూన్ నిమ్మ తొక్కల పొడి వేసుకొని అన్ని కలిసేంత వరకు స్పూన్ తో బాగా మిక్స్ చేసుకుంటే హోం మేడ్ ఫేస్ వాష్ పౌడర్ సిద్ధమైనట్లే.ఈ పౌడర్ ను గాలి చొరబడని డబ్బాలో నింపుకుని పెట్టుకోవాలి.
ఈ పౌడర్ ను ఎలా వాడాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

మొదట చేతిలో వన్ టేబుల్ స్పూన్ తయారు చేసుకున్న పొడిని వేసుకుని అందులో కొద్దిగా వాటర్ ను మిక్స్ చేయాలి.ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి సున్నితంగా అప్లై చేసుకుని వేళ్లతో స్మూత్‌గా రబ్ చేసుకుంటూ ఫేస్ ను వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.ఈ హోం మేడ్ ఫేస్ వాష్ పౌడర్ ను రోజుకు ఒకసారి యూస్ చేయడం వల్ల చర్మంపై పేరుకుపోయిన మురికి, మృతకణాలు తొలగిపోయి.
ముఖం క్లీన్‌గా మరియు ఫ్రెష్ గా మారుతుంది.అలాగే ఈ పౌడర్ ను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల స్కిన్ టోన్ రెట్టింపు అవుతుంది.అదే సమయంలో చర్మం పై ఏమైనా మచ్చలు ఉన్నా క్రమంగా మాయమవుతాయి.ఆయిలీ స్కిన్ సమస్యతో బాధపడే వారికి కూడా ఈ పౌడర్ చాలా మేలు చేస్తుంది.







