రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు ఎంతో గొప్ప దర్శకుడు.వయసు పైబడుతున్న శ్రీదేవి ని కుర్ర హీరోల సరసన తెలుగులో నటింపచేసి హిట్స్ అందుకున్న ఘనుడు.
కేవలం అమే పైన అభిమానం తో తెలుగు లో శ్రీదేవి కి సెకండ్ ఇన్నింగ్స్ సృష్టించాడు.అయితే అదంతా గతం.ఇప్పుడు ఆయన చేతిలో హిట్స్ లేవు అలాగే గొప్ప సినిమాలు లేవు.ఆయన ఏది పడితే అది మాట్లాడుతూ ఆయన మాటకు విలువ లేకుండా చేసుకున్నారు.
తెలుగు నుంచి హిందీ కి వెళ్లి అక్కడ హిట్ సినిమాలు తీసి తెలుగు వాడి పేరు యావత్ భారత దేశం తెలిసేలా చేశాడు.ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.
అయితే ఆయన ఈ మధ్య రాజమౌళి గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.వాస్తవానికి రామ్ గోపాల్ వర్మ కి అతడు మాత్రమే గొప్ప.
ఎవరిని పెద్దగా లెక్క చేయడు.అలాంటి వర్మ రాజమౌళి ని పొగడటం నిజంగా వింతగా ఉంటుంది కానీ అది జరిగింది.
ఇప్పటి వరకు కెరీర్ లో ఒక్క ఫ్లాప్ కూడా లేని వర్మ ఈ విషయాన్ని ఇక్కడ కూడా హైలెట్ చేసుకోడు అని అన్నారు.తెలుగులో మాత్రమే కాదు పాన్ ఇండియాలోనే రాజమౌళి ఒక తోపు దర్శకుడు అంటూ కొనియాడారు.
చాలా మంది దర్శకుడు ఒకటి రెండు సినిమాలు సక్సెస్ అయితేనే తానొక గొప్పవాడని అనే రేంజ్ లో మాట్లాడుతూ ఉంటారు.
కానీ తీసే ప్రతి సినిమాకు మొదటి సినిమాకు పడ్డట్టే కష్టపడటం కేవలం రాజమౌళికి మాత్రమే సాధ్యం.అందరు అతడిలా ఉండలేరు అంటూ రాజమౌళి ని ఆకాశానికి ఎత్తేశాడు.మరి వర్మ కు ఇంత జ్ఞానోదయం ఏ చెట్టు కింద కూర్చుంటే అయ్యిందో తెలియదు కానీ అతడు చెప్పింది అక్షరసత్యం.
ఇప్పటి వరకు ఎక్కడ కూడా తానొక హిట్ చిత్రాల దర్శకుడిగా పొంగిపోలేదు రాజమౌళి.అందుకే ఆయన నాటి నుంచి నేటి వరకు వరస హిట్స్ తో దూసుకుపోతున్నాడు.
రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు తో చేస్తున్న సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుందాం.