1.కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన టిఆర్ఎస్ బృందం

కేంద్ర ఎన్నికల సంఘాన్ని గురువారం తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ బృందం కలిసింది.
2.నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడి ఎదుట గీత రెడ్డి
నేషనల్ హెరాల్డ్ కేసులో మాజీ మంత్రి గీతారెడ్డి గాలి అనిల్ కుమార్ ఈడి అధికారులు ఎదుట హాజరయ్యారు.
3.అలాయ్ బలాయ్ కార్యక్రమానికి చిరంజీవి
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈరోజు 11 గంటలకు జరిగిన అలాయ్ బలాయ్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్ తదితరులు హాజరయ్యారు.
4.టిఆర్ఎస్ బిజెపి కార్యకర్తల మధ్య ఘర్షణ
సిద్దిపేటలో 23 24 వార్డులకు సంబంధించి టిఆర్ఎస్ బిజెపి కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఒకరిపై ఒకరు దాడులకు దిగారు.ఈ ఘటనలో ఇరు పార్టీల కార్యకర్తలకు గాయాలు అయ్యాయి.
5.కెసిఆర్ పై డీకే అరుణ కామెంట్స్
సీఎం కేసీఆర్ బిజెపి నేత డీకే అరుణ విమర్శలు చేశారు .బీఆర్ఎస్ కు వీ ఆర్ ఎస్ తప్పదు అంటూ అరుణ సెటైర్లు వేశారు.
6.వైసిపి ప్రభుత్వంపై వీర్రాజు కామెంట్స్
హిందూ విద్వేషాన్ని వైసీపీ ప్రభుత్వం వెళ్లగక్కుతోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు.
7.చింతకాయల విజయ్ కు సీఐడీ నోటీసులు
ఐ టీడీపీ అధ్యక్షుడు చింతకాయల విజయ్ నోటీసులు అందజేసింది .నేడు ఉదయం 10:30 గంటలకు మంగళగిరి సిఐడి ఆఫీసులో విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపారు.
8.దేవరగట్టు కర్రల సమరంలో 60 మందికి గాయాలు
దేవరగట్టు లో బన్నీ ఉత్సవాలు ఈసారి కూడా దేవరగట్టు కర్రల సమరం జరిగింది. ప్రజలు కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో 60 మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయి.
9.భారత్ జోడో యాత్ర
నేటి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభం కానుంది.
10.వార్డు వాలంటీర్ పోస్టుల భర్తీ
గుంటూరు నగరపాలక సంస్థ పరిధి లో ఖాళీగా ఉన్న 41 వార్డ్ వాలంటీర్ల పోస్టుల భర్తీకి ఈరోజు రేపు మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నారు.
11.నేటితో ముగిసిన దసరా మహోత్సవాలు
శ్రీశైలంలో నేటితో దసరా మహోత్సవాలు ముగిశాయి.ఆలయ పుష్కరిణీ లో వైభవంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి తెప్పోత్సవం నిర్వహించనున్నారు.
12.అమరావతి పరిరక్షణ సమితి రౌండ్ టేబుల్ సమావేశం
నేడు రాజమండ్రిలో అమరావతి పరిరక్షణ సమితి రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది.దీనికి అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలను ఆహ్వానించారు .
13.మోహన్ బాబు యూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ఆహ్వానం
మోహన్ బాబు యూనివర్సిటీ ( ఏంబియూ) అనుభవజ్ఞుల అత్యుత్తమ ప్రతిభ కలిగిన వారు అకాడమిక్ లీడర్స్ నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
14.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది.అక్టోబర్ 4 వరకు సాధారణంగా ఉన్నా.అక్టోబర్ 5 నుంచి క్రమంగా పెరిగింది .
15.ఆర్ఆర్ ఆర్ టీం ప్రకటన
ఈ ఏడాది జరగనున్న ఆస్కార్ బరిలోకి దిగుతున్నట్లు ఆర్ఆర్ఆర్ టీం ప్రకటించింది.
16.భారత్ జోడో యాత్రలో సోనియా
కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ భారత్ జూడో యాత్రలో పాల్గొన్నారు.ఈరోజు ఉదయం కర్ణాటకలోని మాండ్య జిల్లాలోని జక్కన్న హాళ్లి కి చేరుకున్నారు.
17.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,529 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
18.ఏపీలో కేసీఆర్ బహిరంగ సభ
ఏపీలో కేసీఆర్ జాతీయ పార్టీకి మద్దతుగా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.త్వరలోనే విజయవాడలో బీఆర్ ఎస్ పార్టీ మీటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
19.హైదరాబాదులో వర్షం
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వాన కురుస్తోంది.గురువారం ఉదయం నుంచి ఆకాశం పూర్తిగా మబ్బులు కమ్ముకున్నాయి.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,850 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 52,200
.