సాధారణంగా ఆడవారిలో కొందరికి నెలసరి అనేది ప్రతినెలా చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది.కానీ కొందరికి మాత్రం ఎంతో బాధాకరంగా మారుతుంటుంది.
నెలసరి( menstrual cramps ) సమయంలో వచ్చే నొప్పులను తట్టుకోలేక బాగా ఇబ్బంది పడుతుంటారు.ఈ క్రమంలోనే రిలీఫ్ కోసం పెయిన్ కిల్లర్స్( Painkillers ) ను ఆశ్రయిస్తారు.
కానీ పెయిన్ కిల్లర్స్ అక్కర్లేదు.ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను కనుక తీసుకుంటే నెలసరి నొప్పుల నుంచి ఈజీగా రిలీఫ్ పొందవచ్చు.
మరి ఇంతకీ ఆ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా అంగుళం అల్లం ముక్కను( piece of ginger ) తీసుకుని శుభ్రంగా కడిగి పొట్టు తొలగించి మెత్తగా దంచి పెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ బాయిల్ అయ్యాక అంగుళం దాల్చిన చెక్కను ( Cinnamon stick ) ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి.
అలాగే దంచి పెట్టుకున్న అల్లం తురుము వేసి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మరిగించాలి.ఆపై అందులో వన్ టేబుల్ స్పూన్ బెల్లం తురుము( jaggery powder ) వేసి మరొక నిమిషం పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
స్టైనర్ సహాయంతో మరిగించిన నీటిని ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు సేవించాలి.

నెలసరి సమయంలో ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే కడుపునొప్పి, నడుము నొప్పి, కాళ్ళు లాగడం, తల తిరగడం వంటి సమస్యలన్నీ దూరం అవుతాయి.బాడీ తేలిగ్గా మారుతుంది.నెలసరి నొప్పుల నుంచి ఈ డ్రింక్ తో సులభంగా మరియు వేగంగా ఉపశమనం పొందుతారు.
అంతే కాకుండా నెలసరి సమయంలో వచ్చే మూడ్ స్వింగ్స్ ను ఈ డ్రింక్ సెట్ చేస్తోంది.ఒత్తిడిని తగ్గించి మైండ్ ను రిలాక్స్ గా మారుస్తుంది.కాబట్టి ఇకపై మీ నెలసరి సమయంలో పెయిన్ కిల్లర్స్ ను పక్కనపెట్టి నొప్పుల నుంచి రిలీజ్ పొందడానికి ఈ డ్రింక్ ను ప్రయత్నించండి.







