నువ్వుల నూనె వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి అన్న విషయం చాలామందికి తెలుసు.నువ్వుల నూనె కేవలం పూజలో ఉపయోగించడం కోసం మాత్రమే కాకుండా ఈ నూనె వల్ల కొన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
నువ్వుల నూనెలో ఉండే భాస్వరం ఎముకలను బలంగా ఉంచడానికి తోడ్పడుతుంది.అలాగే నువ్వుల నూనెలో సహజంగా సీస్మోల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది.
ఇది అధిక ఉష్ణోగ్రతల వద్ద చాలా త్వరగా క్షీణించడానికి అనుమతించదు.ఆయుర్వేదంలో వంట చేయడానికి ఇది ఉత్తమమైన నూనె అని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు.
నువ్వుల నూనెలో విటమిన్ సి తప్ప ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలు ఎక్కువగా ఉంటాయి.నువ్వులలో విటమిన్ బి మరియు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉంటాయి.
నువ్వులలో రెండు ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి.ఇలాంటి ఆమ్లాలు పప్పు దినుసులు, వేరుశనగలు, బీన్స్ లాంటి ఆహారాలలో ఉండవు.
నువ్వుల నూనెలో క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ లాంటి ముఖ్యమైన ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి.ఇది గుండె కండరాలు సహజంగా పనిచేసేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి.
ఇంకా చెప్పాలంటే చాలామంది ప్రజలు ప్రతిరోజు చేసే పూజలలో ఎక్కువగా నువ్వుల నూనెను ఉపయోగిస్తూ ఉంటారు.చాలా రకాల నూనెలతో పాటు ఎక్కువగా నువ్వుల నూనెను ఉపయోగిస్తూ ఉంటారు.
వేద పండితుల ప్రకారం నువ్వుల నూనె లేకుండా ఏ కార్యక్రమమూ చేయరు.ఏ యజ్ఞం చేసిన, పిత్ర పూజలు చేసిన నువ్వుల నూనెను కచ్చితంగా ఉపయోగిస్తారు.
ఇంకా చెప్పాలంటే ఈ నూనె లేకుండా అసలు ఏ కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టారు.

కాబట్టి పూజకు ఉపయోగించే నూనెలో మొదటిగా నువ్వుల నూనెను ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు.ఇలా దీపారాధనలో ఈ నూనెను ఉపయోగించడం వల్ల మనల్ని వేధించే సమస్యలు,చెడు ప్రభావాలు, మనకు ఎదురయ్యే కష్టనష్టాలు దూరమవుతాయి.అయితే శని దేవునికి శాంతి కోసం ప్రయత్నించే వాళ్ళు ఈ నూనెను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మంచి జరిగే అవకాశం ఉంది.