ఆ యంగ్ హీరోతో అమితాబ్ మనవరాలి ప్రేమాయణం.. కానీ అంత సీక్రెట్ గా?

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి గురించి అందరికీ తెలిసిందే.ఈమె అమితాబచ్చన్ కూతురు కూతురు.

 Amitabh Grand Daughter Love Affair With That Young Hero Details,  Amitabh, Bolly-TeluguStop.com

సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చినప్పటికీ ఈమెకు సినిమా ఇండస్ట్రీలో నటించే ఆసక్తి లేదని ఎన్నో సార్లు పరోక్షంగా వెల్లడించింది.ప్రస్తుతం ఈమె తన తండ్రి మాదిరిగానే వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు.

ఇకపోతే సినిమా ఇండస్ట్రీకి ఈమె దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో తన ప్రేమ గురించి వార్తల్లో నిలుస్తున్నారు.ఈ క్రమంలోనే నవ్య బాలీవుడ్ నటుడు మీజాన్ జఫ్రీతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

 వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఈ విషయంపై మీజాన్ తండ్రి స్పందిస్తూ వారిద్దరూ మంచి స్నేహితులని వెల్లడించారు.

ఈ క్రమంలోనే మీడియా ద్వారా మీజాన్ మాట్లాడుతూ నవ్య తనకు ఒక మంచి స్నేహితురాలని తెలియజేశారు.

ఇకపోతే ఈ క్లారిటీతో వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ కు పులి స్టాప్ పడింది.తాజాగా మరోసారి నవ్య ప్రేమ వ్యవహారం వార్తల్లోకెక్కింది.

ఈ క్రమంలోనే ఈమె బాలీవుడ్ యంగ్ హీరోతో గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉందని ఎవరికి తెలియకుండా వీరి రిలేషన్ సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నట్లు సమాచారం.

Telugu Amitab Bachchan, Amitabh, Bollywood, Granddaughter, Gullyboy, Love, Navya

బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం ఈమె “గల్లీబాయ్” సినిమాతో నటుడిగా క్రేజ్ సంపాదించుకున్న సిద్ధాంత్ చతుర్వేదితో సీరియస్ రిలేషన్షిప్ లో ఉన్నట్లు సమాచారం.వీరిద్దరూ ఎంతో సీరియస్ గా రిలేషన్ లో ఉన్నారని సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.అయితే వీరి రిలేషన్ గురించి ఇటు అమితాబ్ మనవరాలు నవ్య కానీ, బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేది కానీ స్పందించకపోవడం గమనార్హం.

ప్రస్తుతం సిద్ధాంత్ ‘బంటీ అండ్ బబ్లీ 2’ సినిమాలో నటిస్తున్నారు. నవ్య వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube