ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు అయినటువంటి ప్లిప్‌కార్టు, అమెజాన్‌లలో అక్టోబర్ 7వ తేదీ నుంచి భారీ ఆప్షన్ అందుబాటులోకి రానుంది.అవును, ప్రతి ఏడాది ఇదే సమయంలో ఫ్లిప్‌కార్డు ‘బిగ్‌బిలియన్ డేస్( Billion Days Sale )’, అదే అమెజాన్ అయితే ‘గ్రేట్ ఇండియా సేల్( Amazon Great Indian Festival )’ పేరుతో ఆఫర్లు ప్రకటించనున్నాయి.
ఇందులో భాగంగా తక్కువ ధరల్లోనే వివిధ రకాల ప్రోడక్ట్స్ లు కొనుగోలు చేసే అవకాశం వినియోగదారులకు మెండుగా కలదు.అయితే ఈ పండగ సీజన్‌లో అందించే ఆఫర్లలో ఈఎంఐ రూపంలో చెల్లించే వారికి నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌లు కూడా అందిస్తుంటాయి ఆయా కంపెనీలు.

అవును, మీరు విన్నది అక్షరాలా నిజం.మనం ఏదైనా వస్తువును కొనుగోలు చేస్తే నో కాస్ట్ ఈఎంఐ( No cost EMI ) ఉంటుంది.ఇలా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇతర ఆన్‌లైన్ సంస్థలు ప్రత్యేక సేల్ పేరుతో ఆఫర్లు అనేవి ఇస్తుంటాయి. ఈ ఆఫర్లలో ఎన్నో వస్తువులను తక్కువ ధరలకే కొనుగోలు చేయవచ్చు.
ఇక నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ బెనిఫిట్ పొందవచ్చును.ఈ క్రమంలోనే చాలామందికి నిజంగానే మనకు నో-కాస్ట్ ఈఎంఐ వల్ల లాభం ఉంటుందా? అనే అనుమానం కలగవచ్చు.ఇపుడు దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

అవును, అన్ని వస్తువులపై నో కాస్ట్ ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.ఇపుడు డబ్బులు లేకపోయినా ఏమి కావాలన్నా కొనే అవకాశం రావడంతో చాలా మంది ఈఎంఐ రూపంలో కొంటారు.అది కూడా వడ్డీ లేకుండా నో-కాస్ట్ ఈఎంఐ ద్వారా లభిస్తుండటంతో షాపింగ్ చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు.
ఇక సాధారణ ఈఎంఐతో పోలిస్తే నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే? మీరు ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం వుండదు.ఉదాహరణకి మీరు రూ.20 వేలు విలువైన మొబైల్ కొన్నప్పుడు 5 నెలల కాలానికి ఒక రూ.1000 వడ్డీ అనుకుంటే మొత్తం రూ.20,000తోపాటు వడ్డీ కూడా చెల్లించాలి.అదే మీరు నో కాస్ట్ ఈఎమ్ఐ ఆప్షన్ ఎంచుకున్నట్లయితే మనం కొన్న వస్తువు ధర ఎంత ఉంటుందో అంతే మొత్తాన్ని ఈఎంఐల పద్దతుల్లో చెల్లిస్తే సరిపోతుంది.







