మహాదేవుడు.భోళా శంకరుడు.
మనస్సు పెట్టి ప్రార్ధిస్తే మనం అడిగిన కోర్కెలు వెంటనే నెరవేరుస్తాడు.శివారాధన.
మోక్షానికి మార్గం.అలాంటి శివుడిని దర్శించు కోవడానికి గుడికి వెళ్లినప్పుడు మనం కొన్ని పొరపాట్లు చేస్తాం.
ఇలా చేస్తే.శివుడి కరుణకు బదులుగా.
అను గ్రహానికి బదులు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది.శివుడి నైవేధ్యం మనం ఇంటికి తీసుకు రాకూడదు.
ఆలా నైవేద్యం ఇంటికి తీసుకు రావటం చాలా పెద్ద తప్పు.ఎందుకంటే శివుడి వద్ద చండీశ్వరుడు ఉంటాడు.
శివలింగానికి అభిషేకం చేసినప్పుడు అభిషేక జలం.మనం శివాలయంనకు వెళ్ళినప్పుడు పరమాన్నం లేదా పులిహోర,పండ్లు, కొబ్బరికాయ వంటివి నైవేద్యంగా పెడుతూ ఉంటాం.మనం శివునికి ఏమి నైవేద్యం పెట్టిన సరే శివాలయం నుండి ఇంటికి తిరిగి తీసుకు రాకూడదు.
ఆలా నైవేద్యం ఇంటికి తీసుకు రావటం చాలా పెద్ద తప్పు.
శివాలయంలో ఛండీశ్వరుడు ఉంటాడు.శివునికి సమర్పించిన వాటిని చండీశ్వరుడు మాత్రమే తీసుకోవాలని పురాణాలు చెబుతున్నాయి.
శంఖరునికి సమర్పించిన వాటిని ఆలయంలోనే వదిలేయాలి.కానీ ఇంటికి తీసుకురాకూడదు.
అయితే శివాలయం నుంచి కొంచెం అయినా ప్రసాదం తెచ్చుకోవాలంటే.చండీశ్వరుడు దగ్గరకు వెళ్లి చిటికెలు లేదా చప్పట్లు కొట్టి అయన అనుమతి తీసుకొని ప్రసాదాన్ని ఇంటికి తీసుకువెళ్ళవచ్చు.
శివాలయానికి వెళ్ళినప్పుడు నందీశ్వరుడు అనుమతి తీసుకొని శివ దర్శనం చేసుకోవాలి.