సాధారణంగా చెప్పాలంటే మానవ నాగరికతలో మొదట మనిషికి దొరికింది మట్టి ఒక్కటే.గృహ నిర్మాణానికి, కుండలు తయారీకి, గణపతి నవరాత్రులు వంటి వేడుకలకు మట్టిని ఉపయోగిస్తూ ఉంటారు.
శిలకు మట్టికి చాలా తేడా ఉంది.పైగా దేవాలయాలలో( Temples ) ప్రతిష్టిచ్చే విగ్రహం శాశ్వతంగా ప్రాణప్రదంగా ఉండాలి.
అందుకే శిలా ప్రకృతి ప్రసాదించిన వరమైంది.శిలలు విగ్రహాలుగా ఆకృతి దాల్చాలంటే ఎన్నో పరీక్షలకు లోనవుతాయి.
ముఖ్యంగా దేవాలయలలో దేవతల విగ్రహాలను శిల తో ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే శిలలలో బరువు, గట్టి దనం, రంగు, పెళుసుదనం, ఆయుష్షు మొదలైన వాటిని పరిశీలిస్తారు.అలాగే శాండ్‌స్టోన్, లైమ్‌స్టోన్, గ్రానైట్, మార్బుల్ మొదలైనవి ఎన్నో రకాలు ఉన్నాయి.వీటిలో గ్రానైట్( Granite ) చాలా గట్టిగా ఉంటుంది.
శిలలు పర్వతాల నుంచి వచ్చినవే.అంటే భూమిలో నుంచి లభ్యమైనవే.
పర్వత శిఖరాలు దేవతా స్థానాలు.అలా కూడా శిలలకు సంప్రదాయ గౌరవం ఉంది.
కాబట్టి శిలలు ప్రాముఖ్యతను సంచరించుకున్నాయి.ముఖ్యంగా రాతికి గుణం ఒకటి ఉంటుంది.
దీనిపై చక్కటి రూపాలు చాలా సూక్ష్మమైన కళ్లు, రెప్పలు, కనుబొమ్మలు, ముఖకవళికలు సజీవంగా ప్రస్ఫుటం చేసే లక్షణం కృష్ణశిలకు ఉంది.

అందుకే పాలంపేట రామప్ప దేవాలయం( Ramappa Temple )లోని నంది విగ్రహం అంత ప్రాచుర్యం పొందింది.శిల ఏదైనా వాతావరణన్ని తట్టుకొని నిలబడి ఉండాలి.కృష్ణశిల( Krishna shila )కు కూడా ఆ శక్తి ఉంది.
ప్రధానంగా యంత్రబద్ధంగా, మంత్రబద్ధంగా ఆ శిల అవగాహన పొంది ఉంటుంది.మహాశక్తి రూపంగా నిలబడగలిగే సున్నితత్వం దాని లక్షణమై ఉండాలి.
అందుకు శిల అవసరం అయింది.దక్షిణ భారతమం( South India ) తా ఎక్కువగా నల్ల శిల్పాలే ఉపయోగించారు.
ఎందుకంటే మన వద్ద వాటి లభ్యత చాలా ఎక్కువ.ఉత్తర భారతదేశంలో పాలరాయి ఎక్కువగా ఉపయోగించారు.
శిల్పాలన్నీ విగ్రహాలకు పనికిరావు.వాటి శబ్దాన్ని బట్టి అవి ఉన్న ప్రాంతాన్ని బట్టి వాటిని ఉపయోగిస్తారు.