శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఈ మధ్యకాలంలో జరిగిన అవాంఛనీయమైన ఘటనలు భక్తులను భయాందోళనకు గురి చేస్తున్నాయి.ప్రధాన ఉత్సవాలు,రద్దీ రోజుల్లో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.
మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా అధికారుల సమన్వయ లోపం దీనికి కారణాలుగా కనిపిస్తున్నాయి.మూడు నెలల క్రితం సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలోని స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున దేవాలయానికి తరలివచ్చారు.
అదే సమయంలో వ్యతిరేక దిశలో పలువురు అడ్డంగిదారులు దర్శనాలకు చొరబడడంతో స్వామివారి సన్నిధి వద్ద తీవ్ర గందరగోళం ఏర్పడింది.గ్రహణ దర్శనం చేసుకునేందుకు విచ్చేసిన మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలోనే భక్తుల మధ్య గొడవలు జరగడం అప్పట్లో దోమరం రేగింది.
గత సంవత్సరం ఏప్రిల్ నెలలో వేసవి సెలవులు కావడంతో భక్తులు ఆలయానికి భారీగా తరలివచ్చారు.దేవాదాయ శాఖ మంత్రి పొట్టు సత్యనారాయణ దర్శనానికి వచ్చారని కారణంతో అధికారులు పాలకమండలి మధ్య సమన్వయం లేకుండా క్యూలైన్లను బ్లాక్ చేశారు.

దీంతో క్యూ లైన్ లలో అప్పటికే నిరక్షించి విసిగెత్తిన భక్తులు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేసినా ఘటన సంచలనం రేపింది.తాజాగా ఈనెల 13వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి.ఇప్పటికే అన్ని శాఖల అధికారులు రెండు సార్లు సమన్వయ సమావేశం నిర్వహించారు.కానీ సమన్వయం మాత్రం ఇంకా కనబడడం లేదు.ఈ నెల 5వ తేదీన స్వర్ణముఖి నదిలో త్రిశూల స్నానం జరిగింది.త్రిశూల స్నానం వద్ద భక్తుల కోసం అధికారులు ముందస్తుగా పోలీస్ శాఖ బందోబస్తు కోరలేదు.
సెక్యూరిటీ గార్డులు త్రిశూల స్నానంలో భక్తులను కట్టడి చేయలేకపోయారు.నదీ ప్రదేశం విస్తరంగా ఉన్నప్పటికీ భక్తుల మధ్య స్వల్ప తోపులటా జరిగింది.
మహాశివరాత్రి తర్వాతి రోజు రథోత్సవం, అదే రోజు తెప్పోత్సవం, సందర్భంగా భక్తులు మరియు దేవాలయ పరిసర ప్రాంతాల వారు భారీగా తరలివచ్చారు.ముఖ్యంగా చెప్పాలంటే మహాశివరాత్రి రోజు దేవాలయంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని చెబుతున్నారు.