ముఖ్యంగా చెప్పాలంటే పితృ పక్షం( Pithru Paksham ) రోజులలో ప్రజలు తర్పణ, దాన, శ్రద్ధ, పిండ దాన వంటి కర్మలను ఆచరిస్తూ ఉంటారు.ఈ సమయంలో పక్షులు, జంతువులకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు.
కానీ పితృపక్షం సమయంలో కొన్ని జీవులు మనకు ప్రత్యేక సూచనలను ఇస్తాయి.మీ పూర్వికులు ( Ancestors ) మీ చర్యల కారణంగా సంతోషంగా ఉన్నారా లేదా కోపంగా ఉన్నారా అనే విషయాన్ని ఈ జీవులు మనకు తెలియజేస్తాయి.
అంతే కాకుండా మీరు ఇచ్చే ఆహారాన్ని ఆ జీవులు తింటే మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది.పితృపక్షంలో ఏ జీవులు అదృష్టాన్ని తెస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజులలో తమ పూర్వీకుల శ్రద్దం చేసే వారందరూ కాకి( Crow ) కోసం వేచి ఉంటారు.ఎందుకంటే మన పూర్వీకులు కాకుల రూపంలో ఇంటికి వస్తారని చాలా మంది ప్రజలు నమ్ముతారు.మీ పూర్వీకులకు ఆహారంలో కొంత భాగాన్ని సిద్ధం చేసినప్పుడు కాకి వచ్చి తింటే మీ పూర్వీకులు ఆహారాన్ని అంగీకరించారని అర్థం చేసుకోవచ్చు.మీరు నిర్వహించిన శ్రాద్ధ కర్మ కార్యక్రమంతో మీ పూర్వీకులు సంతోషంగా ఉన్నారని అలాగే సంతృప్తి చెందారని తెలుసుకోవచ్చు.
మీ పురోగతి, శ్రేయస్సు, సంతానం, సంపద పెరుగుదల కోసం వారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు.
అంతే కాకుండా పితృ పక్షం రోజులలో పూర్వికులకు ఆహారాన్ని అందించడానికి ఆహారంలో కొంత భాగాన్ని వారికి సంబంధించిన తిధులలో కుక్కలకు( Dogs ) ఇస్తారు.ఈ ఆహారం ఎక్కువగా నల్ల కుక్కలకు ఇస్తూ ఉంటారు.ఇది పూర్వీకుల ఆత్మలను సంతృప్తి పరుస్తుంది.
అప్పుడు మీ పూర్వీకులు వారసులకు శ్రేయస్సుతో పాటు ఆశీర్వాదన్ని అందిస్తారు.అలాగే పితృపక్షం సమయంలో ఆవుకు( Cow ) ఆహారం ఇస్తే ఆ ఆహారాన్ని ఆవు తింటే అది మీ పితృదేవతలకు చేరుతుంది.
మీ పూర్వీకులు మీ చర్యలతో సంతోషంగా ఉన్నారని మీకు పరోక్షంగా సంకేతం లభిస్తుందనీ పండితులు చెబుతున్నారు.
DEVOTIONAL