భద్రాచల రామయ్య దర్శన వేళల గురించి మీకు తెలుసా?

దక్షిణ భారతదేశంలోని తెలంగాణ పావన గోదావరి తీరాన వెలసిన భద్రాచల రామయ్య పుణ్యక్షేత్రం గురించి మనందరికీ తెలుసు.అయితే సీత, లక్ష్మ, ఆంజనేయ స్వామి సమేతంగా ఆ శ్రీరామ చంద్ర స్వామి వెలిశారని స్థల పురాణం.

 Do You Know About Bhadrachala Ramaiah Darshan Timings , Bhadrachalam, Bhadrachal-TeluguStop.com

అయితే మనందరం జీవితంలో ఒక్కసారైన ఆ భద్రాద్రి రాముడిని దర్శించుకోవాలని.సీతారాముల కల్యాణం చూడాలని కోరుకుంటూ ఉంటాం.

అయితే భద్రాచలం వెళ్లాలనుకునే వారు స్వామి వారి దర్శన వేళల గురించి తెలుసుకొని వెళ్లడం మంచిది.అయితే ఆ దర్శన సమయాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం.

ప్రతిరోజూ ఉదయం 4.30 గంటలకు ఆలయ తలపులు తెరిచి సుప్రభాత సేవ నిర్వహిస్తారు.5.30 నుంచి 7 గంటల వరకు బాలభోగం నివేదన.ఆపై ఉదయం 8.35 నుంచి 9.30 వరకు సహస్ర నామార్చన.ఈ పూజలో పాల్గొనేందుకు 100 రూపాయ టిక్కెట్టుపై ఒక్కరు లేదా దంపతులకు అనమతి ఇస్తారు.ఉదయం 8.30 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 12.30 నంచి 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 వరకు అర్చనలు ఉంటాయి.వీటిల్లో 150 రూపాయలు చెల్లించి పాల్గొనవచ్చు.ప్రతిరోజూ ఉదయం 9.30 గంటలకు మొదలయ్యే స్వామి వారి నిత్య కల్యాణంలో పాల్గనేందుకు వెయ్యి రూపాయలు చెల్లిస్తే ఒకరు లేదా దంపతులను అనుమతిస్తారు.ఉదయం 11.30 నుంచి మద్యాహ్నం 12 వరకు రాజభోగం నిర్వహిస్తారు.మధ్యాహ్నం 1 నుంచి 3 వరకు ఆళయాన్ని మూసి వేస్తారు.రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు దర్బార్ సేవ జరుగుతుంది.8.30 నుంచి 9 వరకు నివేదన, పవళింపు సేవ ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube