ఈ సంవత్సరం హోళికా దహనం( Holika Dahan ) మార్చి 24వ తేదీన జరుపుకున్నారు.మార్చి 25వ తేదీన హోలీ ( Holi ) జరుపుకుంటారు.
జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్పిన దాని ప్రకారం ఈ ఏడాది భద్రకాలం రాత్రి 10:50 గంటల వరకు ఉంటుంది.నివసిస్తున్న ప్రదేశానికి అనుగుణంగా ఈ సమయంలో కొద్దిగా అటు ఇటు మార్పులు వస్తాయి.
ఈ ఏడాది హోలీని చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది.అయితే దీని ప్రభావం భారత్ మీద లేకపోవడం వలన ఎటువంటి ప్రభావం చూపదు.
జ్యోతిష్యులు చెప్పే దాని ప్రకారం హోళిక దహనం భద్రకాలం ముగిసిన తర్వాతే నిర్వహించాలి.
ఇక మార్చి 25వ తేదీన సూర్యోదయ సమయం వరకు వరికా దహనం నిర్వహించుకోవచ్చు.
ఈ ఏడాది హోళికా దహనం 9 శుభయోగాలతో వచ్చింది.గత 700 సంవత్సరాల లో ఇటువంటి శుభకరమైన యాదృచ్ఛికం జరగలేదని పండితులు కూడా చెబుతున్నారు.హోళికా దహనం రోజున ఏర్పడే శుభయోగాలు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి.9 శుభయోగాలు( Nine Auspicious Yogas ) ఎలాంటి ఫలితాలు ఇస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

సర్వార్థ సిద్ధి యోగం:
ఈ ప్రభావం వలన చేసే పనులకు విజయం లభిస్తుంది.
లక్ష్మీయోగం:
లక్ష్మీదేవి ఆశీస్సులతో( Lakshmidevi Blessings ) ఈ యోగం వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు.
పర్వత యోగం:
ఈ యోగం మిమ్మల్ని అదృష్టవంతులను చేస్తుంది.అలాగే రాజకీయాల్లో ఉంటున్న వ్యక్తులను ఈ యోగం ప్రత్యేకమైనదిగా నిలుస్తుంది.

కేదార్ యోగం:
ఈ యోగం కీర్తి, వైభవం, పేరు, ప్రతిష్టలు, శక్తి సామర్థ్యాలను పెంచుతుంది.వారికి ఈ యోగం కూడా అత్యుత్తమ ఫలితాలను ఇస్తుంది.
వరిష్ట యోగం:
ఈ యోగం సంతానం లేని వారికి సంతానాన్ని ఇస్తుంది.అలాగే అదృష్టం, విజయం, కీర్తిని కూడా తీసుకొస్తుంది.
అమల యోగం:
ఈ యోగం వ్యక్తిగత, వృత్తిపరమైన ఆనందం, విజయాన్ని అందిస్తుంది.అంతేకాకుండా వ్యాపారంలో ( Business ) ఉన్న వారికి ఈ యోగం భారీ లాభాలను కూడా తీసుకొస్తుంది.
సరళ యోగం:
శత్రువులపై విజయం సాధించడంలో ఈ యోగం సహాయపడుతుంది.అలాగే విశ్వాసాన్ని కూడా పెంచుతుంది.