ఓనం పండుగ ఎప్పుడు.. ఎన్ని రోజులు జరుపుకుంటారో తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే కేరళ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓనం పండుగ ఆదివారం మొదలు అయింది.తొలి రోజున అత్తమ్‌తో మొదలై పదో రోజున తిరుఓనమ్‌తో ముగిసే ఈ పండుగ ప్రాముఖ్యత, శుభ ముహూర్తం విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 Do You Know When And How Many Days The Onam Festival Is Celebrated? , Onam Fe-TeluguStop.com

కేరళ( Kerala )లో జరుపుకునే అతి ముఖ్యమైన పెద్ద పండుగలలో ఓనం పండుగ ఒకటి అని ఖచ్చితంగా చెప్పవచ్చు.తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగను ఎంతో బాగా జరుపుకుంటాము.కేరళలో అంతే సందడిగా ఓనం పండుగను జరుపుకుంటారు. రైతులు పండించిన పంట కోతకు రావడంతో ఆనందపడుతూ చేసుకునే పండుగ కూడా ఇదే.

Telugu Onam, Bhakti, Devotional, Farmers, Kerala, Onam Festival-Latest News - Te

పురాణాల ప్రకారం పది రోజుల ఓనం పండుగను గొప్ప మహారాజు అయిన మహాబలిని ఆహ్వానించే సంజ్ఞగా జరుపుకుంటారు.ఓనం సందర్భంగా ఆ గొప్ప రాజుకు చెందిన ఆత్మ ఆ రాష్ట్రానికి వస్తుందని వాళ్ళ నమ్మకం.ఇంకా చెప్పాలంటే ఓనం వేడుకలలో భాగంగా తొలి రోజును అతమ్‌గా చివరి రోజున తిరు ఓనమ్ వేడుకలను నిర్వహిస్తారు.ఈ రెండు రోజులు చాలా కీలకమైనవిగా పరిగణిస్తారు.

ఈ సంవత్సరం ఆగస్టు 20న ఓనం పండుగను అతమ్‌ తో ప్రారంభించి ఆగస్టు 31వ తేదీన తిరు ఓనం వేడుకలను( Onam festival ) జరుపుకోనున్నారు.

Telugu Onam, Bhakti, Devotional, Farmers, Kerala, Onam Festival-Latest News - Te

అంతేకాకుండా ఇతర ప్రాంతాల నుంచి వలస వెళ్లినవారు సైతం ఓనమ్ పండుగ సమయంలో సొంత గ్రామాలకు చేరుకుంటారు.అందుకే మలయాళీలకు ఈ పండుగ అంటే ఎంతో ఇష్టం.అంతేకాకుండా ఈ సమయంలోనే పడవ పందాలు కూడా జరుగుతాయి.

ఈ పండుగ మలయాళీలతో పాటు అన్ని మతాలకు చెందిన వారు జరుపుకుంటారు.పది రోజుల ఈ పండుగలో ఈ రెండు రోజులను మాత్రం కేరళ ప్రజలు చాలా ముఖ్యమైన రోజులుగా భావిస్తారు.

ఈ పండుగ సందర్భంగా కేరళ ప్రజలు 10 రోజులపాటు వారసత్వంగా వచ్చిన వారి గొప్ప సంప్రదాయాలను ప్రతిబింబించేలా, అవి ప్రపంచానికి తెలిసేలా ఎంతో అద్భుతంగా జరుపుకుంటారు.అలాగే 1961 లో ఈ పండుగను కేరళ జాతీయ పండుగగా గుర్తించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube