Ravi tree devotinal : రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..

భారతదేశంలో హిందువులు కొన్ని రకాల మొక్కలను ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు.అంతేకాకుండా ఆ మొక్కలకు పూజలు కూడా చేస్తూ ఉంటారు.

 Do You Know What Happens When Circling Around The Ravi Tree , Ravi Tree, Devotin-TeluguStop.com

అలాంటి వాటిలో తులసి, వేపా, జిల్లేడు లాంటి ఎన్నో రకాల మొక్కలను పూజిస్తూ ఉంటారు.ఇలాంటి ఎన్నో మొక్కలను మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు పూజలు చేస్తూ వాటి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు.

మన దేశవ్యాప్తంగా ఎంతో పవిత్రంగా భావించే చెట్లలో రావి చెట్టు కూడా ఒకటి.

అలా రావి చెట్టుకు పూజలు చేయడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయని చాలామంది ప్రజలు నమ్ముతున్నారు.

రావి చెట్టును అశ్వత్థ వృక్షం అని కూడా అంటూ ఉంటారు.రావి చెట్టుకు పూజ చేయాలి అనుకున్న వారు సూర్యోదయం తర్వాత నది స్నానం చేసి రావి చెట్టును పూజ చేయాలి.

అలాగే ఏడుసార్లు అభిషేకం చేసి విష్ణు సహస్రనామాలను చదువుతూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉండాలి.అంతేకాకుండా రావి చెట్టును తాకుతూ ప్రదక్షిణలు చేయకుండా ప్రతి ప్రదక్షిణ అనంతరం నమస్కరిస్తూ ప్రదక్షణ చేస్తూ ఉండాలి.

రావి చెట్టుకి ప్రతిరోజు పూజ చేసినప్పటికీ ఆదివారం, మంగళవారం సంధ్యా సమయంలో రావి చెట్టును తాకడం అంత మంచిది కాదు.కేవలం శనివారం రోజు మాత్రమే రావి చెట్టును తాకి పూజ చేసిన తర్వాత మనసులో ఉన్న కోరికలను కోరుకోవడం వల్ల మనసులో ఉన్న మంచి మంచి కోరికలు నెరవేరుతాయి.

Telugu Basil Tree, Devotional, Lord Vishnu, Pooja, Ravi Tree, River, Saturday, S

పురాణ శాస్త్రాల ప్రకారం ఎవరైతే సూర్యోదయానికి ముందు నిద్రలేచి స్నానం చేసి రావి చెట్టుకు నీరు పోసి పూజిస్తారో అటువంటి వారిపై శని ప్రభావం ఎప్పటికీ ఉండదు.అంతేకాకుండా శనివారం రోజు రావి చెట్టుకి పూజ చేసే సమయంలో రావి చెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించడం వల్ల ఇంకా ఎక్కువగా మంచి జరిగే అవకాశం ఉంది.రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి పూజ చేయడం వల్ల కోరిన కోరికల్ని నెరవేరడంతో పాటు శని దేవుని అనుగ్రహం కూడా అటువంటి వారిపై తప్పకుండా ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube