చాలామంది ఈ మధ్యకాలంలో ఆర్థిక సమస్యల( Financial problems )తో బాధపడుతున్నారు.ఆర్థిక సమస్యలు లేని ఇల్లు అంటూ లేదు.
అలాగే ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడానికి కూడా చాలామంది వాస్తు సలహాలను పాటిస్తున్నారు.అయితే వాస్తు శాస్త్రం మన ఇంట్లో ఉంటే వాస్తు దోషాలను తొలగించి కుటుంబానికి శ్రేయస్సును, ఆర్థిక కృషిని ఇస్తుందని చెబుతున్నారు.
అయితే చెట్లు అలాగే మొక్కలు హిందూ మతంలో పూజించదగినవిగా పరిగణించబడతాయి.అయితే దేవతలు చెట్ల పైన ఉంటారని చెబుతారు ప్రతి శుభకార్యములోను మొక్కలను ఉపయోగిస్తారు.
మరి ముఖ్యంగా అరటి చెట్టు( Banana tree )ను ప్రతి శుభకార్యములకు కూడా ఉపయోగించడం తరచూ చూస్తూనే ఉంటాం.అయితే తులసి ఆకులు, మామిడి ఆకులు, అరటి ఆకులు లాంటివి మొదలైనవన్నీ ఏ పూజలోనైనా ఉపయోగిస్తూ ఉంటారు.అయితే అరటి చెట్టులో నివసిస్తారని ఓ గాఢమైన నమ్మకం ఉంది.విష్ణువును పూజించడం వలన విష్ణు( Lord vishnu ) యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం లభిస్తుంది.అరటి చెట్టు యొక్క మూలాన్ని కూడా పవిత్రంగా భావిస్తారు.ఓ వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారినప్పుడు, ఆర్థిక సంక్షోభంతో ఇబ్బంది పడుతుంటే, వారు అరటి చెట్టు యొక్క మూలానికి 11 సార్లు ప్రదక్షణ చేస్తే చాలా మంచి జరుగుతుందని చెబుతారు.
అలాగే అరటి చెట్టు వేరులో బెల్లం, శనగపప్పు, పసుపు ముద్ద సమర్పిస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.అలాగే లక్ష్మీదేవి( Lakshmi Devi ) అనుగ్రహం లభిస్తుంది.
ఇంట్లో ప్రతికూలతను తొలగించి సానుకూలతను తీసుకురావాలని అనుకుంటే అరటి చెట్టు యొక్క మూలాలను ఇంటి ప్రధాన ద్వారానికి కట్టడం చాలా మంచిది.అలాగే ఇంట్లో ఆనందం, శాంతి నెలకొల్పాలంటే అరటి వేరుతో కలిపిన నీటిని ప్రతి రోజు సమర్పించినట్లయితే మంచి జరుగుతుంది.అలాగే అరటి చెట్టు వేరును పూజించడం వలన మంగళ దోషం తొలగిపోతుంది.ఓ వ్యక్తి వివాహం జరగకుండా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే నెల అలాంటివారు గురువారంనాడు పసుపు రంగు దుస్తులను ధరించి పూజ చేయడం మంచిది.
అలాగే ఏక ధనవంతులు కావాలనుకునే వారు కూడా ఎర్రటి గుడ్డలో, అరటి వేరును కట్టి తమ గదిలో ఉంచుకోవాలి.ఇలా చేయడం వలన ఆ వ్యక్తి యొక్క ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది.
DEVOTIONAL