ఆడవారు వేదం ఎందుకు చెప్పకూడదో తెలుసా.. చెబితే ఏమవుతుంది..!

ఆడవారు వేదమంత్రాలు ఎందుకు చెప్పకూడదన్న ప్రశ్న పూర్వం రోజుల నుంచి ఉంది.రానున్న తరాల్లో కూడా ఇది ఉద్భవించవచ్చు.

 Why Are Women Unfit To Recite The Vedas Details,  Women , Vedas, Women Recite Ve-TeluguStop.com

అయితే మన పూర్వీకులు, పండితులు ఏ నియమాలు చెప్పినా వాటి వెనుక తప్పనిసరిగా ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది.మహిళలు( Women ) ఎందుకు వేదాలు ( Vedas ) చెప్పకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

వేదాలు సర్వం మాత్రానుగుణంగా ఉచ్ఛరించాలి.అయితే పురుషదేహా నిర్మాణానికి, స్త్రీ దేహ నిర్మాణానికి వ్యత్యాసం ఉంటుంది.

నాడీ మండల వ్యవస్థ ఆడవారికి సరైన స్వరోచ్చారణకు పూర్తిగా సహకరించదు.పురుషులకు వోకల్ ఫోల్డ్స్ ( Vocal Folds ) 17mm-25mm పొడవు ఉంటే, స్త్రీలకు 12.5-17.5mm ఉంటుంది.దీనివల్ల వారి పిచ్ లో తేడా ఉంటుంది.వేదమంత్రాలన్ని ఉదాత్త, అనుదాత్త స్వరానుగుణంగా ఆయా స్థాయిలో ఉచ్చరించాలి కాబట్టి ఇది స్త్రీలకు పూర్తిగా సాధ్యపడదు.వేదమంత్రాల స్వరాలు నాభి నుంచి పలకవలసి వస్తుంది.దానివల్ల పొత్తికడుపు మీద ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

స్త్రీ శరీర నిర్మాణం ప్రకారం వారికి ఇలాంటి ఒత్తిడి పెరిగితే అది రుతుక్రమం మీద ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉంది.

Telugu Bhakti, Devotional, Menopause, Spiritual, Veda Mantras, Vedas, Vocal Fold

ఇప్పటికీ వైద్య విధానాల్లో సంగీత థెరపి వలన రోగులలో హార్మోన్లు అధికంగా ఉత్పత్తి కావడం, తక్కువ చేయడం శాస్త్రీయంగా నిరూపితమైంది.వేదమంత్రాన్ని తప్పుగా ఉచ్చరిస్తే రావాల్సిన ఫలితం రాకపోగా వ్యతిరేక ఫలితం కూడా ఉంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే గురుపదేశం లేకుండా సరైన ఉచ్చరణ సాధ్యం కాదు.

సంకేతిక పరిజ్ఞానం ప్రకారం చూసిన ఆడవారికి మెనోపాజ్( Menopause ) వరకు వారిని చాలా శక్తివంతమైన హార్మోన్లు కాపడతాయి.

Telugu Bhakti, Devotional, Menopause, Spiritual, Veda Mantras, Vedas, Vocal Fold

ఒకసారి ఆ సమయం వచ్చాక వారికి ఒక్కసారి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది అని పరిశోధనలలో తెలిసింది.ముఖ్యంగా చెప్పాలంటే ఈ నియమం కేవలం మహిళల ఆరోగ్యం కోసం పెట్టినది మాత్రమే.అంతమాత్రాన వేదాలు చదవకూడదు వాటి గురించి తెలుసుకోకూడదు అని కాదు.

వేరే వ్యాఖ్యానాలు పూర్తిగా చదివి కచ్చితంగా తత్త్వం తెలుసుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube