రెబల్ స్టార్ ప్రభాస్ చేసిన 'తప్పే'... రాఖీ బాయ్ చేస్తాడా ?

గత మూడు వారాల క్రితం పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన కన్నడ మూవీ కెజిఎఫ్ చాప్టర్ 2 విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది.ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని ఇప్పటికే స్టడీ గా కలెక్షన్ లు సాధిస్తూ ఆర్ ఆర్ ఆర్ లాంటి దిగ్గజ మూవీకి పోటీగా రికార్డులను సృష్టించే దిశగా వెళుతోంది.

 Hero Yash Repeating Prabhas Mistake , Hero Yash , Prabhas , Prabhas Mistake ,-TeluguStop.com

కాగా గడిచిన మూడు వారాలకు ఈ సినిమా 1100 కోట్లు సాధించింది.ఇక ఇందులో హీరోగా నటించిన యష్ గురించి చర్చలు జోరుగా సాగుతున్నాయి.

అయితే ఇప్పుడు ఇంతటి ఘనవిజయం తర్వాత యష్ కెరీర్ లో ఎటువంటి మార్పులు తీసుకోనున్నాడన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.ఎలా అయితే ప్రభాస్ లాంటి స్టార్ బాహుబలి మరియు బాహుబలి 2 వియాళ తర్వాత వరుసగా ప్లాప్ లను ఎదుర్కొంటున్నాడు.

అయితే ప్రభాస్ కెరీర్ ఇలా పడిపోవడానికి చేసిన మిస్టేక్స్ ఏంటి ? ఈ విషయాలను యష్ గుర్తించుకుని… భవిష్యత్తులో పాటిస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.

Telugu Aamir Khan, Bahubali, Dangal, Yash, Kgf Chapter, Prabhas, Radhe Shyam, Ra

సౌత్ ఇండియా నుండి ఇప్పటి వరకు రెండు సినిమాలు సీక్వెల్స్ గా రిలీజ్ అయి సంచలన విజయాలు సాధించారు.అంతే కాకుండా ఈ సినిమాలో నటించిన ఇద్దరు హీరోలు పాన్ ఇండియా హీరోలుగా మారిపోయారు.వారిలో ఒకరు జక్కన తీర్చిదిద్దిన ప్రభాస్ అయితే, మరొకరు ప్రశాంత్ నీల్ అందించిన యష్.ప్రశాంత్ నీల్ సహాయంతో ఇప్పుడు కన్నడ సినిమా కూడా సౌత్ లో ఒక పేరును తెచ్చుకుంది.అంతే కాకుండా ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ బాషలలో వంద కోట్ల వసూళ్లు సాధించిన ఏకైక సినిమాగా రికార్డు సృష్టించింది.

ఇక హిందీలో అయితే అమీర్ ఖాన్ దంగల్ మూవీ కలెక్షన్ లను అధిగమించి సౌత్ సినిమా పవర్ ను చూపించింది.

Telugu Aamir Khan, Bahubali, Dangal, Yash, Kgf Chapter, Prabhas, Radhe Shyam, Ra

ఇక పాన్ ఇండియా స్థాయికి వచ్చిన ప్రభాస్ దిక్కు తెలియకుండా చేసిన కొని పొరపాట్ల కారణంగా బాహుబలి తర్వాత మరో హిట్ ను అందుకోలేకపోయాడు.ముఖ్యంగా ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజిత్ తో ‘సాహో‘ లాంటి భారీ సినిమా తీయడం రాంగ్ స్టెప్ అని చెప్పాలి.ఇది అట్టర్ ప్లాప్ అయింది.దీని తర్వాత మళ్ళీ ఇంకో తప్పు చేశాడు.‘జిల్’ సినిమా తీసిన రాధాకృష్ణ కుమార్ తో రాధే శ్యామ్ లాంటి పాన్ ఇండియా మూవీని తీశాడు.ఇది కూడా ప్లాప్ అయి కూర్చుంది.అయితే ప్రభాస్ లా దెబ్బ తినకుండా ఉండాలంటే… యష్ ఏమి చెయ్యాలి ? అందుకే కెజిఎఫ్ స్టార్ పెద్ద పెద్ద పెద్ద డైరెక్టర్లు మరియు నిర్మాతలు నుండి వరుస అవకాశాలు వస్తున్న ఇంకా ఏదీ కంఫర్మ్ చేయలేదు.అందుకే మళ్ళీ వేరే డైరెక్టర్ తో చేయకుండా తన గురించి బాగా తెలిసిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లోనే కెజిఎఫ్ చాప్టర్ 3 తీయడానికి ప్లాన్ చేస్తున్నారట.అయితే మళ్ళీ ఇదే సబ్జక్ట్ కాకుండా కొత్తగా కంటెంట్ తీసుకునే పనిలో పడ్డారట యష్.అయితే ఫ్యాన్స్ కూడా యష్ నుండి వచ్చే మరో సినిమా ఖచ్చితంగా ఇంకో రేంజ్ లో ఉంటాయి.మరి యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటి? కథ ఏమిటి? కెజిఎఫ్ లాంటి సబ్జెక్టు కాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీనుకుంటాడు అన్న విషయాలు తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube