టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం.ఈ సినిమా మే 6వ తేదీ విడుదలయ్యి మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ఈ సినిమా విడుదల కాకముందు ఎన్నో వివాదాలను ఎదుర్కొన్నప్పటికీ సినిమా విడుదలై పాజిటివ్ టాక్ సంపాదించుకోవడం చిత్రబృందం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే సినీ సెలబ్రిటీల కోసం ఒక రోజు ముందుగానే ఈ సినిమాను ప్రదర్శించారు.
ఈ క్రమంలోనే ఈ సినిమాపై మెగా హీరో సాయిధరమ్ తేజ్, మంచు విష్ణు, సిద్దు జొన్నలగడ్డ వంటివారు సినిమా ఎంతో అద్భుతంగా ఉందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రియేటివ్ దర్శకుడిగా ఎంతో పేరు సంపాదించుకున్న సుకుమార్ తాజాగా ఈ సినిమాపై స్పందించారు.
ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ విశ్వక్ సేన్ నటించిన సినిమాని తాను చూశానని, సినిమా ఎంతో అద్భుతంగా ఉంది అంటూ కామెంట్ చేశారు.ఇలా ఒక కుర్ర హీరో నటించిన సినిమా ని స్టార్ హీరో చూసి ఆ సినిమా గురించి ప్రశంసలు కురిపించడం విశేషం.

ఇకపోతే ఈ సినిమాని సుకుమార్ తో పాటు ఆయన శిష్యుడు బుచ్చిబాబు కూడా వీక్షించారు.ఈ క్రమంలోనే బుచ్చిబాబు కూడా ఈ సినిమాపై స్పందించి సినిమా చాలా అద్భుతంగా ఉందని తెలియజేశారు.మొత్తానికి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ సినిమా విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకుందని చెప్పాలి.







