Skin Whitening Oil : మీ ముఖ చర్మం వైట్ అండ్ స్మూత్ గా మెరిసిపోవాలా.. అయితే ఈ మ్యాజికల్ ఆయిల్ మీ కోసమే!

అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ ముఖ చర్మం తెల్లగా మరియు మృదువుగా మెరిసిపోతూ కనిపించాలని కోరుకుంటారు.అటువంటి చర్మాన్ని పొందడానికి రకరకాల క్రీములు వాడుతుంటారు.

 Try This Magical Oil For White And Smooth Skin-TeluguStop.com

తరచూ వేలకు వేలు ఖర్చు పెట్టి ఫేషియల్ చేయించుకుంటూ ఉంటారు.అయితే వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.

ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ ఆయిల్ మాత్రం మీ ముఖ చర్మాన్ని చాలా తక్కువ సమయంలోనే వైట్ అండ్ స్మూత్ గా మెరిసేలా చేస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Tips, Face Oil, Skin, Magical Oil, Skin Care, Skin Care Tips, Skin Oil, S

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఐదు టేబుల్ స్పూన్లు ఆవ నూనె( Mustard Oil ), ఐదు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజల పొడి, వన్ టేబుల్ స్పూన్ కాఫీ పొడి, వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పొడి( Green tea powder ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ గిన్నెను మరుగుతున్న నీటిలో ఆరు నుంచి పది నిమిషాల పాటు ఉంచి డబుల్ బాయిలర్ మెథడ్ లో హీట్ చేయాలి.

Telugu Tips, Face Oil, Skin, Magical Oil, Skin Care, Skin Care Tips, Skin Oil, S

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.ఇక ఈ ఆయిల్ ను ఎలా వాడాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

రోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి ఏమైనా మేకప్ అంటే తొలగించి వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఆపై తయారు చేసుకున్న ఆయిల్ ను ముఖానికి మరియు మెడకు కూడా అప్లై చేసుకుని సున్నితంగా నాలుగు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.

మరొస‌టి రోజు ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఈ ఆయిల్ చర్మ ఆరోగ్యాన్ని అద్భుతంగా మెరుగుప‌రుస్తుంది.ముడతలు, చర్మం సాగటం, చారలు వంటి వృద్ధాప్య ఛాయలు త్వరగా దరి చేరకుండా అడ్డుకట్ట వేస్తుంది.అలాగే ఈ ఆయిల్ స్కిన్ టోన్ ను ఇంప్రూవ్ చేస్తుంది.

అదే సమయంలో చర్మాన్ని స్మూత్ గా మెరిపిస్తుంది.యవ్వనంగా మారుస్తుంది.

వైట్ అండ్ స్మూత్ స్కిన్ ను కోరుకునే వారికి ఈ ఆయిల్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు.కాబట్టి తప్పకుండా ట్రై చేయండి.

అందంగా మెరిసిపోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube