దిండు లేకుండా నిద్రించ‌డం వ‌ల్ల ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా?

ఆరోగ్యమైన జీవితాన్ని గడపాలంటే పోషకాహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం.దాదాపు 90 శాతం రోగాలకు సరైన నిద్ర లేకపోవడం కూడా ఒక కారణం.

 Benefits Of Sleeping Without A Pillow! Sleeping, Pillow, Health, Health Tips, Go-TeluguStop.com

నిద్రను నిర్లక్ష్యం చేస్తే ఒత్తిడి, అధిక బరువు, మధుమేహం, గుండె జబ్బులు( Diabetes , heart disease ), రక్తపోటు ఇలా ఎన్నో ఎన్నెన్నో సమస్యలు చుట్టుముడ‌తాయి.అందుకే రోజుకు ఎనిమిది గంటల పాటు నిద్రించాలని నిపుణులు ఎప్ప‌టిక‌ప్పుడు చెబుతుంటారు.

ఇకపోతే నిద్రపోయే సమయంలో ఏమున్నా లేకపోయినా తల కింద దిండు మాత్రం కచ్చితంగా ఉండాల్సిందే.

Telugu Acne, Pain, Tips, Latest, Neck Pain, Pillow, Benefits, Wrinkles-Telugu He

మనలో చాలా మంది దిండు లేనిదే నిద్ర పోలేరు.కానీ దిండు లేకుండా నిద్రపోవడం వల్ల అనేక‌ ప్రయోజనాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు.మరి ఆ ప్రయోజనాలు ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

దిండు లేకుండా రాత్రుళ్లు నిద్ర పోవడం మీ మెడ మరియు వెన్నెముకను సమలేఖనం చేయడానికి సహాయపడుతుంది. వెన్ను మరియు మెడ నొప్పి నుండి ఉపశమనం పొందుతారు.

Telugu Acne, Pain, Tips, Latest, Neck Pain, Pillow, Benefits, Wrinkles-Telugu He

అలాగే దిండు లేకుండా పాడుకోవ‌డం వ‌ల్ల ముఖంపై త్వ‌ర‌గా ముడ‌త‌లు రాకుండా ఉంటాయి.అవును, మీరు విన్న‌ది నిజ‌మే.దిండుపై పడుకోవడం వల్ల మీ చర్మంపై ఒత్తిడి పడుతుంది, ఇది కాలక్రమేణా ముడతలకు దారితీస్తుంది.అందువ‌ల్ల ముడ‌త‌ల‌కు దూరంగా ఉండాల‌నుకుంటే దిండును ఎవైడ్ చేయండి.కొంద‌రికి ముఖంపై త‌ర‌చూ మొటిమ‌లు వ‌స్తుంటాయి.ఇందుకు దిండుపై నిద్రించ‌డం కూడా ఒక కార‌ణం.

మురికి దిండుల నుండి వృద్ధి చెందే బ్యాక్టీరియా మొటిమలు, మ‌చ్చ‌లు వంటి చర్మ స‌మ‌స్య‌ల‌కు కారణమవుతుంది.కొంద‌రు ఉద‌యం లేవ‌డం లేవ‌డంతోనే త‌ల‌నొప్పి( Headache ) అని అంటుంటారు.

అలాంటివారు దిండు లేకుండా నిద్రించ‌డానికి ప్రయత్నించండి.దిండుతో నిద్రించడం వల్ల తలకు రక్త ప్రసరణ తగ్గుతుంది.

ఇది తలనొప్పికి దారి తీస్తుంది.అయితే దిండు లేకుండా నిద్రించ‌డం అనేది అంద‌రికీ అనుకూలంగా ఉండ‌క‌పోవ‌చ్చు.

బ్యాక్ స్లీపర్స్‌, సైడ్ స్లీప‌ర్స్ దిండు లేకుండా నిద్రపోకూడదు.దిండు లేకుండా నిద్రపోవడం వ‌ల్ల గురక మరియు స్లీప్ అప్నియా లక్షణాలు మరింత అధ్వాన్నంగా మార‌తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube