ఒక్క దెబ్బతో మెడ నలుపును పోగొట్టే కలబంద.. ఎలా వాడాలంటే?

కొందరి ముఖ చర్మం ఎంతో తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది.కానీ మెడ మాత్రం డార్క్ గా కనిపిస్తుంది.

 Aloe Vera Helps To Get Rid Of Dark Neck Naturally! Aloe Vera, Dark Neck, Dark Ne-TeluguStop.com

ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో మరియు డెలివరీ అనంతరం మహిళలు ఈ సమస్యను ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు.ఈ క్రమంలోనే మెడ నలుపును ఎలా వదిలించుకోవాలో తెలియక మదన పడుతూ ఉంటారు.

‌ తోచిన చిట్కాలు అన్నీ పాటిస్తుంటారు.మార్కెట్లో లభ్యమయ్యే ఉత్పత్తుల‌ను కొనుగోలు చేసి వాడుతుంటారు.

కొందరు బ్యూటీ పార్లర్ కు వెళ్లి బ్లీచ్ వంటి పద్ధతులు ఫాలో అవుతుంటారు.

అయితే కలబంద ఒక్క దెబ్బతో మెడ నలుపును పోగొడుతుంది.

చర్మ సౌందర్యానికి మరియు జుట్టు సంరక్షణకు కలబంద ఎంతగానో సహాయపడుతుంది.అలాగే మెడ నలుపును వదిలించడానికి కూడా ఉపయోగపడుతుంది.

అందుకోసం కలబందను ఎలా వాడాలి అన్నది ఏ మాత్రం లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Aloe Vera, Tips, Dark Neck, Latest, Skin Care, Skin Care Tips-Telugu Heal

ముందుగా ఒక కలబంద ఆకును తీసుకుని నీటిలో శుభ్రంగా కడగాలి.ఇలా కడిగిన కలబంద నుంచి జెల్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ జెల్ లో రెండు టేబుల్ స్పూన్లు షుగర్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి.

ఈ మిశ్రమాన్ని మెడపై అప్లై చేసి స్మూత్ గా స్క్రబ్బింగ్ చేసుకోవాలి.కనీసం రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేళ్ళతో సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకుని.ఆపై పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

Telugu Aloe Vera, Tips, Dark Neck, Latest, Skin Care, Skin Care Tips-Telugu Heal

అనంతరం వాటర్ తో శుభ్రంగా మెడను క్లీన్ చేసుకుని ఏదైనా మాయిశ్చరైజ‌ర్ ను అప్లై చేసుకోవాలి.ఇలా చేస్తే ఒక్క దెబ్బతో మెడ నలుపు వదిలిపోతుంది.కాబట్టి ఎవరైతే మెడ నలుపుతో తీవ్రంగా సతమతం అవుతున్నారో వారు తప్పకుండా కలబందతో పైన చెప్పిన విధంగా చేయండి.

మంచి రిజల్ట్ మీ సొంతమవుతుంది.మెడకు మాత్రమే కాదు అండర్ ఆర్మ్స్ లో నలుపును వదిలించడానికి కూడా ఈ రెమెడీ ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube