మన భారత దేశంలో ఎన్నో పురాతనమైన దేవాలయాలు మరియు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.ఈ పుణ్య క్షేత్రాలకు ప్రతి రోజు ఎంతో మంది భక్తులు తరలి వచ్చి భగవంతుని దర్శించుకుంటూ ఉంటారు.
అలాగే మరి కొంత మంది భక్తులు స్వామి వారికి పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే ఒక్కొక్క దేవాలయానికి కొన్ని రకాల సంప్రదాయాలు, ఆచారాలు ఉంటాయి.
అలాగే శ్రీరామనవమి ( Sriramanavami )సందర్భంగా భక్తులకు భద్రాద్రి రామయ్య దేవస్థానం( Bhadradri Ramayya Temple ) శుభవార్త చెప్పింది.ఈ సంవత్సరం భద్రాద్రిలో జరిగే సీతారాముల కల్యాణ తలంబ్రాలు భక్తులకు అందించాలని కీలక నిర్ణయం తీసుకుంది.
ఇంకా చెప్పాలంటే శ్రీ రామ నవమి సందర్భంగా టిఎస్ ఆర్టీసీ( TSRTC ) ద్వారా భక్తులకు ఈ తలంబ్రాలను అందజేయనున్నారు.తలంబ్రాలు కావాల్సినవారు తమ కార్గో పార్సిల్ కేంద్రాల్లో రూ.116 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాలని సంస్థ ఎండి సజ్జనార్ వెల్లడించారు.
ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్ లోని బస్ భవన్ లో కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్ ను బుధవారం టీఎస్ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఆవిష్కరించారు.అలాగే కళ్యాణ ఉత్సవం తర్వాత తలంబ్రాలను భక్తుల ఇంటికే పంపిస్తామని ఎండి సజ్జనార్ వెల్లడించారు.మొదటిగా ఆయన రూ.116 చెల్లించి బుకింగ్ మొదలు పెట్టారు.గత సంవత్సరం కూడా దాదాపు 89 వేల మందికి తలంబ్రాలు అందించామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.
భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ సేవలను పొందాలనుకునేవారు 9177683134, 7382924900, 9154680020 ఆర్టిసి లాజిస్టిక్స్ విభాగం ఫోన్ నెంబర్ల కు సంప్రదించాలని వెల్లడించారు.ఈ కార్యక్రమం లో ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వి.రవీందర్, జాయింట్ డైరెక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.